logo

నేడు కలెక్టరేట్‌లో స్పందన

కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తారని కలెక్టర్‌ పి.రాజబాబు తెలిపారు.

Published : 29 May 2023 05:31 IST

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తారని కలెక్టర్‌ పి.రాజబాబు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరవ్వాలని సూచించారు. మండల, డివిజన్‌స్థాయిల్లోనూ స్పందన కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ అర్జీలను సమీప ప్రాంతాల్లోనూ సమర్పించవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు.


బుడమేరు కరకట్ట పనులపై రైతుల అభ్యంతరం

అరిపిరాల(నందివాడ), న్యూస్‌టుడే: అరిపిరాల వద్ద బలహీనంగా ఉన్న బుడమేరు కుడి కరకట్టను పటిష్ఠపరిచేందుకు అంచుల్లోని మట్టినే తవ్విపోయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 34.800 నుంచి 35.000 కిలోమీటర్ల పరిధిలో బుడమేరు కుడి కరకట్ట బలహీనంగా ఉంది. దీన్ని పటిష్ఠపరిచేందుకు ఓఅండ్‌ఎం నిధులు రూ. 36.90 లక్షలతో గత ఆర్థిక సంవత్సరంలో అధికారులు ప్రతిపాదన పంపారు. ఎప్పుడో జరగాల్సిన పనులను తీరిగ్గా మే నెల చివరి వారంలో ప్రారంభించారు. కట్ట అంచుల్లోని మట్టినే తవ్వి కరకట్టకు తరలిస్తున్నట్లు తెలిసి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారంటూ తెదేపా నాయకుడు, వీఆర్‌ పురం సర్పంచి కాకరాల సురేశ్‌, మరికొందరు రైతులు నిలదీశారు. అంచుల్లోని మట్టిని తవ్వి కట్టకుపోస్తే కరకట్ట తెగిపడే ప్రమాదం ఉందని, అంతంత మాత్రం పనులకు రూ. లక్షల్లో ప్రతిపాదనలు ఎందుకు పంపారని ఏఈ ప్రసాద్‌, డీఈఈ గణపతితో చరవాణిలో మాట్లాడారు. రూ.లక్షలతో పనులు జరుగుతుంటే శాఖాపరంగా ఒక్క అధికారి పర్యవేక్షణ కూడా లేదని ఆగ్రహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని