logo

గుడివాడలో భారీ వర్షం

గుడివాడ పట్ణణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులు, వీధులు జలమయమయ్యాయి.

Published : 31 May 2023 05:06 IST

బస్టాండ్‌ ఆవరణలో నిలిచిన వాన నీరు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడ పట్ణణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులు, వీధులు జలమయమయ్యాయి. మురుగు కాల్వలు పొంగి రహదారులపై ప్రవహించడంతో ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసి బస్టాండులో మోకాళ్లలోతు నీరు చేరడంతో  ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పట్టణంలోని సత్యనారాయణపురం, పెద్దవీధి, రాజేంద్రనగర్‌, టీచర్స్‌ కాలనీ, కాకతీయనగర్‌, ఎన్టీఆర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వర్షం నీటిలో వాహనాలు మొరాయించడంతో పలువురు చోదకులు కష్టాలు పడ్డారు.

ఇదీ రహదారుల తీరు..

తమిరిశ(నందివాడ), న్యూస్‌టుడే: గుంతలతో అంతంతమాత్రంగా ఉన్న రహదారులు మంగళవారం కురిసిన వర్షానికి వాహన చోదకులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టాయి. రహదారి గుంతల్లో వర్షపు నీరు చేరి బురదమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గుడివాడ-పోలుకొండ-కానుకొల్లు(జీపీకే) ఆర్‌అండ్‌బీ రహదారి లింగవరం నుంచి పలుచోట్ల అధ్వానంగా తయారైంది. బురదగా మారడంతో ద్విచక్ర వాహన చోదకులు, ఆటోవాలాలు తీవ్ర ఇబ్బంది పడుతూ ప్రయాణించాల్సిన దుస్థితి. జనార్దనపురం-నందివాడ, పోలుకొండ-ఎల్‌ఎన్‌పురం, గండేపూడి-పెదవిరివాడ, రామాపురం-అరిపిరాల రహదారులు గుంతలతో వాహనచోదకులు, ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. జీపీకే రహదారిలో లింగవరం-తమిరిశ మధ్య 2.5 కిలోమీటర్ల రహదారిని పునర్నిర్మిస్తున్నప్పటికీ రెండు నెలల క్రితం నిలిచిన పనులు పునఃప్రారంభం కాలేదు. పుట్టగుంట-చేదుర్తిపాడు మధ్య కూడా రెండేళ్ల క్రితం రహదారి అభివృద్ధి చేసినప్పటికీ చివరి దశ(తారు) పనులు ఆగిపోయాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే కారణమని తెలుస్తోంది. దండిగానపూడి, రామాపురం గ్రామ ప్రధాన రహదారులను కూడా మూడేళ్ల క్రితం ప్రారంభించినా నేటికీ పూర్తిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

గుడివాడ-పోలుకొండ-కానుకొల్లు రహదారిపై గుంతలతో వాహన చోదకుల అవస్థలు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని