logo

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామంలోని టిడ్కో కాలనీ ప్రారంభానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వస్తుండటంతో ఆయన పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌, ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), కలెక్టర్‌ పి.రాజబాబు, సంయుక్త కలెక్టర్‌ అపరాజిత సింగ్‌, ఎస్పీ పి.జాషువా మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Published : 31 May 2023 05:06 IST

టిడ్కో కాలనీలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త  రఘురామ్‌, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, కలెక్టర్‌ రాజబాబు, ఎస్పీ జాషువా

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామంలోని టిడ్కో కాలనీ ప్రారంభానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వస్తుండటంతో ఆయన పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌, ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), కలెక్టర్‌ పి.రాజబాబు, సంయుక్త కలెక్టర్‌ అపరాజిత సింగ్‌, ఎస్పీ పి.జాషువా మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టిడ్కో లేఔట్‌లో ప్రజలకు అందించాల్సిన అన్ని వసతులపై చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే ప్రజలకు, లబ్ధిదారులకు చేయాల్సిన ఏర్పాట్లు, సభా ప్రాంగణం పనులపై అధికారులతో సమీక్షించారు. కాలనీలోకి వెళ్లడానికి కాలువ పక్కన నిర్మాణంలో ఉన్న రహదారుల పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నాటికి టిడ్కో కాలనీలో పూర్తి చేయిల్సిన పైపులైను, రహదారులు, కాలువపై తాత్కాలిక వంతెనల నిర్మాణ పనులపై అధికారులకు సూచనలు చేశారు. భారీ వర్షం కురవడం వల్ల లేఔట్‌లో కొనసాగుతున్న పనులను గొడుగుల సాయంతో వెళ్లి చూశారు. పనులన్నీ పూర్తి కాగానే ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అవుతుందని వైకాపా నాయకులు చెబుతున్నారు. అనంతరం కలెక్టర్‌ పి.రాజబాబు అధికారులతో మున్సిపల్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్డీవో పి.పద్మావతి, మున్సిపల్‌ కమిషనర్‌ వి.మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని