Gudivada: కొడాలి నానీ.. 25 ఏళ్లుగా చేసిన అభివృద్ధి ఇదేనా?: రావి వెంకటేశ్వరరావు
దీర్ఘకాలంగా అధికారంలో ఉండి మీరు సాధించిన ఘనత ఇదేనా అంటూ ఎమ్మెల్యే కొడాలి నానీని ప్రశ్నిస్తూ ఆర్టీసీ బస్టాండు, తదితర ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిలో నిల్చొని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మంగళవారం నిరసన తెలిపారు.
బస్టాండులో చేరిన వాన నీటిలో నిరసన తెలియజేస్తున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తెదేపా నాయకులు
గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే : దీర్ఘకాలంగా అధికారంలో ఉండి మీరు సాధించిన ఘనత ఇదేనా అంటూ ఎమ్మెల్యే కొడాలి నానీని ప్రశ్నిస్తూ ఆర్టీసీ బస్టాండు, తదితర ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిలో నిల్చొని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మంగళవారం నిరసన తెలిపారు. 25 ఏళ్లుగా గుడివాడ అభివృద్ధిని బ్రష్టు పట్టించి ఆయన మాత్రం కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. తను ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు 260 డ్రెయిన్లు నిర్మిస్తే వాటి నిర్వహణకూడా సరిగా చేయకుండా కొద్ది రోజుల క్రితం అధిక అంచనాలతో రూ.లక్షల్లో దోచుకున్నారని రావి విమర్శించారు. అధికారులు కూడా నాయకులతో కలిసి పంచుకోవడానికి అలవాటు పడి పట్టణంలో డ్రెయిన్ల పూడిక తీతకు అధిక అంచనాలు వేసి ప్రజాధనం కొల్లగొడుతున్నారన్నారు. తెదేపా నాయకులు పండ్రాజు సాంబశివరావు, కాశీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Gunniness Record: ఒక్కరోజే 3,797 ఈసీజీలు.. గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో చోటు
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ
-
Manoj Manchu: మంచు మనోజ్ సరికొత్త టీవీ షో.. ఎక్కడో తెలుసా?
-
TTD: గరుడ వాహనంపై మలయప్పస్వామి.. భక్త జనసంద్రంగా తిరుమల
-
Manchu Lakshmi: నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్
-
Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!