logo

చూసి.. వదిలేస్తున్నారు

రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనాల అద్దాలకు ఎలాంటి స్టిక్కర్లు అతికించకూడదు. సామాన్యులు ఎండ పడకూడదని బ్లాక్‌ షేడ్‌ స్టిక్కర్లు అతికిస్తే ట్రాఫిక్‌ పోలీసులు అస్సలు ఒప్పుకోరు.

Published : 01 Jun 2023 05:17 IST

డిప్యూటీ మేయర్‌ వాహనం వెనుక..

వాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనాల అద్దాలకు ఎలాంటి స్టిక్కర్లు అతికించకూడదు. సామాన్యులు ఎండ పడకూడదని బ్లాక్‌ షేడ్‌ స్టిక్కర్లు అతికిస్తే ట్రాఫిక్‌ పోలీసులు అస్సలు ఒప్పుకోరు. వెంటనే వాటిని తొలగిస్తారు. విజయవాడ నగరంలో సాక్షాత్తూ డిప్యూటీ మేయర్‌, ఏపీ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వాహనం వెనుక ఇలా ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ పోస్టర్లు పెట్టేయడం గమనార్హం. వీరిని మాత్రం ట్రాఫిక్‌ పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ప్రజాప్రతినిధులే ఇలా నిబంధనలు మీరడంపై నగరవాసులు విమర్శిస్తున్నారు.

ఈనాడు, అమరావతి

ఏపీఐడీసీ ఛైర్మన్‌ కారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు