logo

పామాయిల్‌ పొట్టు రవాణాతో రూ.44.3 లక్షల ఆదాయం

పామాయిల్‌ గింజల పొట్టు రవాణా ద్వారా విజయవాడ డివిజన్‌కు తొలి రోజు రూ.44.3లక్షల ఆదాయం లభించింది. 2,680 టన్నుల పొట్టును డివిజన్‌ పరధిలోని సామర్లకోట నుంచి ఉత్తరాఖండ్‌కు బుధవారం విజయవంతంగా రవాణా చేశారు.

Published : 01 Jun 2023 05:19 IST

సరకు లోడింగ్‌

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే : పామాయిల్‌ గింజల పొట్టు రవాణా ద్వారా విజయవాడ డివిజన్‌కు తొలి రోజు రూ.44.3లక్షల ఆదాయం లభించింది. 2,680 టన్నుల పొట్టును డివిజన్‌ పరధిలోని సామర్లకోట నుంచి ఉత్తరాఖండ్‌కు బుధవారం విజయవంతంగా రవాణా చేశారు. ఇప్పటి వరకు రోడ్డు రవాణా ద్వారా ఎక్కువ ఖర్చు అయ్యేవి. దీనిపై కమర్షియల్‌ అధికారులు వ్యాపారులతో సమావేశమై రైళ్ల ద్వారా రవాణా చేయడం వల్ల కలిగే లాభాలను వివరించడం ద్వారా సత్ఫలితాలనిచ్చాయి. రైళ్ల ద్వారా రవాణా చేయడం వల్ల టన్నుకు అయ్యే ఖర్చు రోడ్డు రవాణాతో పోలిస్తే 45 శాతం తక్కువగా ఉంటుంది. విజయవాడ డివిజన్‌ నుంచి పామాయిల్‌ పొట్టు రవాణా ద్వారా తొలిరోజు ఎక్కువ ఆదాయం గడించడంపై డీఆర్‌ఎం షివేంద్రమోహన్‌ సీనియర్‌ డీసీఎం వి.రాంబాబుతో పాటు కమర్షియల్‌ అధికారులను అభినందించారు. రోడ్డు రవాణాతో పోలిస్తే రైళ్ల ద్వారా కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు వివరించాలని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని