logo

తెరపడని వివాదం

ఫ్లెక్సీల ఏర్పాటులో పోలీసులు, కార్పొరేషన్‌ అధికారులు అందరికీ ఒకే న్యాయం అన్న సూత్రాన్ని విస్మరించారు. ప్రతిపక్షాలకు చెందిన ఫ్లెక్సీలను ఏకపక్షంగా తొలగిస్తుండటం ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

Published : 01 Jun 2023 05:27 IST

మచిలీపట్నంలో పోలీసుల ఏకపక్ష వైఖరి

మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: ఫ్లెక్సీల ఏర్పాటులో పోలీసులు, కార్పొరేషన్‌ అధికారులు అందరికీ ఒకే న్యాయం అన్న సూత్రాన్ని విస్మరించారు. ప్రతిపక్షాలకు చెందిన ఫ్లెక్సీలను ఏకపక్షంగా తొలగిస్తుండటం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. నగరంలో పేదలకు.. పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ వైకాపా ఏర్పాటు చేసిన పోస్టర్లకు వ్యతిరేకంగా మంగళవారం సామాన్య ప్రజలకు... రాక్షసపాలనకు యుద్ధం అంటూ జనసేన నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మాత్రమే కార్పొరేషన్‌ అధికారులు, పోలీసులు తొలగించడం వివాదస్పదమైంది. బుధవారం తెదేపా ఆధ్వర్యాన బాబాయి గొడ్డలికి...బంగారు భవిష్యత్‌కు యుద్ధం అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఏకపక్షంగా పోలీసులే తొలగించడం.. ఇదేం న్యాయమని ప్రశ్నించిన తెదేపా నాయకులను అదుపులోకి తీసుకోవడం వివాదాన్ని మరింత రాజుకునేలా చేసింది. పోలీసులు, మున్సిపల్‌ అధికారులు అధికార పార్టీకి వంత పలుకుతూ తమనే లక్ష్యంగా చేసుకోవడాన్ని త్రీవంగా పరిగణిస్తున్న ప్రతిపక్ష నాయకులు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. బుధవారం ఘటనపై పోలీసులను ప్రశ్నించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఫ్లెక్సీల సంస్కృతికి తెరతీసిన వైకాపావి ఎందుకు తొలగించలేదని పశ్నిస్తే వారి నుంచి సక్రమమైన సమాధానం రాలేదు. రెండు రోజుల క్రితం ఇంగ్లీష్‌పాలెంలో తెదేపా సానుభూతిపరులపై దాడి జరిగి ఒకరి పరిస్థితి విషమంగా ఉంటే నిందితులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని, ప్రతి చిన్న విషయానికి తమను కట్టడి చేయాలని చూడటం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోనేరుసెంటరులో పోలీసులు, తెదేపా నాయకుల తోపులాట

కార్పొరేషన్‌కు కాలినడకన వెళ్తున్న కొల్లు రవీంద్ర, పార్టీ నాయకులు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని