Sujana chowdary: భాజపా అధిష్ఠానంతో పవన్‌ చర్చలు జరిపారు: సుజనా చౌదరి

ఈ తొమ్మిదేళ్లలో నవభారత్‌ ఆవిష్కృతమైందని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి మోదీ పాలనపై కరపత్రాలను విజయవాడలో ఆయన విడుదల చేశారు.

Updated : 01 Jun 2023 13:58 IST

విజయవాడ: ఈ తొమ్మిదేళ్లలో నవభారత్‌ ఆవిష్కృతమైందని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి మోదీ పాలనపై కరపత్రాలను విజయవాడలో ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ‘‘ఏపీ విభజన చట్టంలోని అనేక అంశాలను మోదీ అమలు చేశారు. రాష్ట్రానికి ఎయిమ్స్‌, విద్యా సంస్థలు, జాతీయ రహదారులు ఇచ్చారు. రాష్ట్రంలో అసమర్థ పాలన వల్ల పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగలేదు. ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కూడా ఇవ్వట్లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా సీఎం జగన్‌ నాశనం చేశారు. 

మోదీ నిధులిచ్చినా 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రగతిని ఆపేశారు. పొత్తులపై మా పార్టీ అధిష్ఠానంతో పవన్‌ కల్యాణ్‌ చర్చలు జరిపారు. భాజపా-జనసేన పార్టీలు పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయి. అధిష్ఠానం ఏం చెబితే మేం అలాగే ముందుకెళ్తాం. ఈశాన్య రాష్ట్రాలతో పోల్చితే ఏపీకి కేంద్రం ఎక్కువ సాయం చేసింది. ఈ విషయంపై ఎవరు చర్చకు వచ్చిన నేను సిద్ధంగా ఉన్నా’’ అని సుజనా చౌదరి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని