logo

దుర్గగుడికి డిప్యూటీ ఈవో

విజయవాడ దుర్గగుడికి తొలిసారి డిప్యూటీ ఈవోను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు రెండేళ్ల కిందట డిప్యూటీ ఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.

Published : 02 Jun 2023 04:14 IST

తొలిసారిగా నియమించిన ప్రభుత్వం
ఇంద్రకీలాద్రి నుంచి ఆరుగురు బదిలీ

ఈనాడు, అమరావతి: విజయవాడ దుర్గగుడికి తొలిసారి డిప్యూటీ ఈవోను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు రెండేళ్ల కిందట డిప్యూటీ ఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ.. ఇప్పటివరకూ పోస్టులో ఎవరినీ వేయలేదు. తాజాగా జరిగిన బదిలీల్లో భాగంగా తొలిసారి అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి ఉన్న పి.గురుప్రసాద్‌ను దుర్గగుడి డిప్యూటీ ఈవోగా నియమించింది. ప్రస్తుతం ఈయన శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఈవోగా ఉండి.. బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. ఆలయంలో ఇప్పటివరకూ ఈవో తర్వాత స్థాయిలో ఐదుగురు ఏఈవోలు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరికి మధ్యలో మరో అధికారి రాబోతున్నారు. దుర్గగుడి నుంచి ఆరుగురు ఉద్యోగులు రాష్ట్రంలోని పలు దేవాలయాలకు బదిలీ అయ్యారు. ఇతర ఆలయాల నుంచి ఇక్కడికి మరో ఆరుగురు వస్తున్నారు. ఆలయంలో ఏఈవోగా పనిచేస్తున్న ఎన్‌.రమేష్‌బాబు సింహాచలం బదిలీ అయ్యారు. సూపరింటెండెంట్‌ ఎన్‌.వి.లక్ష్మి సింహాచలం ఆలయానికి డిప్యుటేషన్‌పై వెళ్లారు. సీనియర్‌ అసిస్టెంట్లు పి.శిరీషను అన్నవరానికి, జె.కామేశ్వరిని ద్వారకా తిరుమలకు బదిలీ చేశారు. ఆలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్న కె.బలరామకృష్ణ, ఎం.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌ ద్వారకా తిరుమల ఆలయానికి బదిలీ అయ్యారు.

ఆరుగురు ఇక్కడికి రాక..: సింహాచలం నుంచి ఎస్‌.సన్యాసిరావు (ఏఈ), ద్వారకా తిరుమల నుంచి జూనియర్‌ అసిస్టెంట్లు వి.కొండరామాచార్యులు, వై.రజితరాణి, కె.లక్ష్మినరసమ్మ, కె.వి.బి.కాత్యాయని బదిలీపై విజయవాడ దుర్గగుడికి వస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు