logo

‘తెదేపా ఎన్నికల ప్రణాళికతో వైకాపా నాయకుల్లో భయం’

మహానాడులో తెదేపా ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక చూసి వైకాపా నాయకులకు భయం పట్టుకుందని బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి విమర్శించారు.

Published : 02 Jun 2023 04:14 IST

పటమట, న్యూస్‌టుడే: మహానాడులో తెదేపా ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక చూసి వైకాపా నాయకులకు భయం పట్టుకుందని బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి విమర్శించారు. చంద్రబాబుపై వైకాపా నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెదేపా బీసీ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో గురువారం ఆటోనగర్‌లోని పార్టీ కార్యాలయం ఆవరణలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి జోగి రమేష్‌, మాజీ మంత్రి కొడాలి నానీల చిత్రపటాలను చింపి నిరసన తెలిపారు. అనంతరం గురుమూర్తి మాట్లాడుతూ అసమర్థ మంత్రిగా పేరు తెచ్చుకున్న జోగి రమేష్‌ మహానాడులో చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను చింపగలిగారు గానీ..కోట్లాది ప్రజల ఆదరణను ఏమి చేయగలరని ప్రశ్నించారు. తెదేపా హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లను ప్రజలకు అందించలేని నిస్సహాయ స్థితిలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ఉన్నారన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి కనకాచారి మాట్లాడుతూ రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆ పదవికి మాయని మచ్చ తెచ్చారన్నారు. సీతారాంను వెంటనే ఆ పదవి నుంచి తొలిగించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు కాకు మల్లికార్జున్‌, మరుపిల్ల తిరుమలేష్‌, శొంఠి శివరాం ప్రసాద్‌, పామర్తి కిషోర్‌బాబు, వెంకన్న, ఆరేపల్లి వెంకటేశ్వరరావు, రాధారపు ఎల్లబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని