logo

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యతశుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో వివిధ శాఖల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

Published : 03 Jun 2023 03:52 IST

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న న్యాయమూర్తి కృష్ణయ్య, డీఆర్వో వెంకటేశ్వర్లు తదితరులు

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యతశుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో వివిధ శాఖల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థ ఆదేశాలతో ఈనెల 30వరకు జాతీయ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నెల రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ కె.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ అన్ని శాఖల సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తామని,  జిల్లా వ్యాప్తంగా  బాలకార్మికులకు విముక్తి కల్పించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా బాలల చేత పనులు చేయించుకుంటున్నట్లు గుర్తిస్తే మచిలీపట్నం డివిజన్‌ అధికారి ఎస్‌.గోవిందు    (9492555104)కు, గుడివాడ డివిజన్‌ వి.చక్రధర్‌ (9492555097)లకు ఫిర్యాదు చేయాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలలను కార్మికులుగా పెట్టుకుంటే చట్ట పరంగా కఠిన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని అన్నారు. కార్యక్రమ బ్రోచర్‌ను న్యాయమూర్తితోపాటు అధికారులు కలిసి ఆవిష్కరించారు. దిశ డిఎస్పీ యు.నాగరాజు, మహిళాశిశుసంక్షేమశాఖ ఈడీ విజయలక్ష్మి, డీవైఈవో యూవీ సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని