logo

గ్రామాలకు చేరువగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రజలకు చేరువ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిందని రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ కమిషనర్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రామకృష్ణ పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 03:52 IST

ఆన్‌లైన్‌ విధానాన్ని పరిశీలిస్తున్న రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ కమిషనర్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రామకృష్ణ

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రజలకు చేరువ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిందని రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ కమిషనర్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రామకృష్ణ పేర్కొన్నారు. గుడివాడ మండలం లింగవరం గ్రామంలోని సచివాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శుక్రవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పలు గ్రామాల్లో తొలుత సచివాలయాల ద్వారా పలు రకాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించిందన్నారు. కృష్ణా జిల్లాలో గుడివాడ మండలంలోని లింగరవరం గ్రామం శివారు మెరకగూడెంను ఎంపిక చేశామన్నారు. ఈ క్రమంలో ఇక్కడ గత ఏడాది అక్టోబరు 2 నుంచి ఇంతవరకూ 52 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ జాయింట్‌ కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సరోజిని, జిల్లా రిజిస్ట్రార్‌ ఉపేంద్ర, సబ్‌ రిజిస్ట్రార్లు సీహెచ్‌.సీతారామాంజనేయులు, కె.శ్రీనివాస్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని