logo

12 లోగా నాడు-నేడు పనులు పూర్తి చేయాలి

జూన్‌ 12 నాటికి జిల్లాలో నాడు-నేడు ద్వారా చేపట్టిన పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజబాబు అధికారులను ఆదేశించారు.

Published : 03 Jun 2023 03:52 IST

సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌, జేసీ

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జూన్‌ 12 నాటికి జిల్లాలో నాడు-నేడు ద్వారా చేపట్టిన పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై జేసీ అపరాజితసింగ్‌తో కలిసి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. వివిధ పాఠశాలల్లో చేపట్టిన నూతన టాయిలెట్లు, వంటగదులు, అదనపు తరగతి గదులు,  ఇతర మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,723 పనులు చేపట్టినట్టు చెప్పారు. వీటిల్లో 752 పనులు 90 శాతం, 556 పనులు 60 శాతం మేర పూర్తయ్యాయన్నారు. ఆయా పాఠశాలల పరిధిలోని సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, హెచ్‌ఎం, పనులు చేపట్టే ఏజెన్సీ ప్రతినిధితో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయాలన్నారు. రోజూ క్షేత్రస్థాయి పరిశీలన చేసి పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలనీ, పనులు చేసే మేస్త్రి పేరు సైతం నివేదికలో పేర్కొనాలన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ శేఖర్‌, విద్యా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఈఈ సోమేశ్వరరావు, పీఆర్‌ ఈఈ ఏవీఎస్‌ శ్రీనివాసరావు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని