logo

జగన్‌కు ఓటమి భయం: తెదేపా

వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గద్దె రామమోహన్‌ విజయాన్ని ఆపడం ఎవరితరం కాదని, రాష్ట్రంలోనే మొట్టమొదట తెదేపా గెలిచే సీటు ఇదే అవుతుందని పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 03:52 IST

కర పత్రాలు విడుదల చేస్తున్న గద్దె, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర తదితరులు

కరెన్సీనగర్‌: వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గద్దె రామమోహన్‌ విజయాన్ని ఆపడం ఎవరితరం కాదని, రాష్ట్రంలోనే మొట్టమొదట తెదేపా గెలిచే సీటు ఇదే అవుతుందని పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇటీవల మహానాడులో చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ ఎన్నికల ప్రణాళికపై గురునానక్‌ రోడ్డులోని ఎన్‌.ఎ.సి. కల్యాణ మండపంలో శుక్రవారం గద్దె రామ మోహన్‌ నేతృత్వంలో పార్టీ శ్రేణులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల ప్రణాళికతో ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. రామయ్య మాట్లాడుతూ... వైకాపా ఎమ్మెల్యేలు సైతం రామ మోహన్‌ను ఓడించడం కష్టమని చెబుతున్నారని, ఆ తీరుగానే అత్యధిక మెజారిటీతో గద్దెను గెలిపించుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... జగన్‌ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తెదేపాపై అవాకులు, చవాకులు పేలుతున్నారని అన్నారు. చంద్రబాబు కట్టించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేందుకు మనసు ఒప్పని జగన్‌ పేదల పక్షపాతి ఎలా అవుతారని ప్రశ్నించారు. గద్దె మాట్లాడుతూ... తెదేపా ఎన్నికల ప్రణాళికపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గురువారం రాత్రి చంద్రబాబుతో తాను సమావేశమయ్యానని, పథకాలు ఎలా అమలు చేయబోతున్నామో చెప్పారని అన్నారు. నాయకులు గద్దె అనూరాధ, చెన్నుపాటి గాంధీ, ఎస్‌.ఫిరోజ్‌, జాస్తి సాంబశివరావు, పొట్లూరి సాయిబాబు, నందిపాటి దేవానంద్‌, గద్దె ప్రసాద్‌, దాసరి గాబ్రియేలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని