logo

ప్రయాణం నరకం

బాలేశ్వర్‌ జిల్లాలో ఘోరరైలు ప్రమాదం నేపథ్యంలో విజయవాడ మీదుగా నడిచే 23 రైళ్ల రద్దు.. 26 రైళ్ల డైవర్షన్‌తో విజయవాడలో ప్రయాణీకులు అవస్థలు పడ్డారు.

Published : 04 Jun 2023 03:58 IST

కిక్కిరిసిన బోగీలో ఇలా...

బాలేశ్వర్‌ జిల్లాలో ఘోరరైలు ప్రమాదం నేపథ్యంలో విజయవాడ మీదుగా నడిచే 23 రైళ్ల రద్దు.. 26 రైళ్ల డైవర్షన్‌తో విజయవాడలో ప్రయాణీకులు అవస్థలు పడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చి అక్కడ నుంచి చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రైళ్లు పూర్తిస్థాయిలో లేక వచ్చిన కొన్ని రైళ్లల్లోనే కిక్కిరిసి ప్రయాణించారు. రైలులో మరుగుదొడ్లలో కూడా కిక్కిరిసి కూర్చున్నారు. రిజర్వేషన్‌ బోగీలు... జనరల్‌ బోగీల్లా మారాయి. కనీసం నిలుచోవడానికి కూడా ఖాళీ లేని పరిస్థితి. తాగడానికి నీళ్లు లేక గొంతెండిపోయి విజయవాడ రైల్వేస్టేషన్లో నీళ్ల కోసం పరుగులు తీశారు. రైలులో ఎక్కడా నీటి చుక్క రాని పరిస్థితితో నరకం చూస్తున్నామని ప్రయాణికులు వాపోయారు.

లోపల ఖాళీ లేక మరుగుదొడ్డిలో చోటు కోసం పోరాటం


చంటి పిల్లలతో  అవస్థలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని