పేదల పెన్నిధిగా చెప్పుకోవడం సిగ్గుచేటు
తెదేపా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన దాదాపు 100కు పైగా సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి తాను పేదల పెన్నిధిగా చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న కొల్లు రవీంద్ర, పార్టీ నాయకులు
మచిలీపట్నం(కోనేరు సెంటరు), న్యూస్‌టుడే: తెదేపా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన దాదాపు 100కు పైగా సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి తాను పేదల పెన్నిధిగా చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. మహానాడు విజయవంతాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొల్లుకు అభినందనలు తెలిపి కేట్ కట్ చేయించి ఆనందోత్సాహాలు పంచుకున్నారు. రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రం నుంచి వైకాపాను తరిమికొడితేనే అన్ని వర్గాలకు సంక్షేమం, యువతకు భవిత దక్కుతుందన్నారు. ఉచిత ఇసుకను రద్దు చేసి సామాన్య, పేద, కార్మిక వర్గాలను, అన్నక్యాంటీన్లు మూసేసి నిరుపేద వర్గాల ఉసురు పోసుకుంటున్న జగన్‌కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలవదంటూ ఎద్దేవా చేశారు. రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి, అభివృద్ధి ఊసే లేకుండా చేసి ఏమొహం పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. వైకాపా పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయన్నారు. మహానాడు వేదికగా చంద్రబాబు పార్టీ శ్రేణుల్లో కసి, పట్టుదల పెంచారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం పతనంకాక తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ బాబాప్రసాద్, పార్టీ నాయకులు ఇలియాస్‌పాషా, కాంతారావు, పల్లపాటి సుబ్రమణ్యం, అక్కుమహంతిరాజా, శివ, రాంబాబు, ఫణికుమార్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్