logo

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గుడివాడ పర్యటన త్వరలో ఖరారు కానుండడంతో కలెక్టర్‌ పి.రాజబాబు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, అధికారులు శనివారం టిడ్కో కాలనీలో పర్యటించారు.

Published : 04 Jun 2023 03:58 IST

రూట్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని, కలెక్టర్‌ రాజబాబు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గుడివాడ పర్యటన త్వరలో ఖరారు కానుండడంతో కలెక్టర్‌ పి.రాజబాబు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, అధికారులు శనివారం టిడ్కో కాలనీలో పర్యటించారు. కాలనీలో సీఎం సభా ప్రాంగణం ఏర్పాటు చేయాల్సిన ప్రాంతం, హెలీప్యాడ్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి తీసకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్డీవో పి.పద్మావతి, మున్సిపల్‌ కమిషనర్‌ వి.మురళీ కృష్ణ, టిడ్కో పీడీ చిన్నోడు, వైకాపా రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్‌, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ పాల్గొన్నారు.

* ఉదయం కూడా ఎమ్మెల్యే కొడాలి నాని టిడ్కో కాలనీలో కొనసాగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులతో కలిసి రోడ్లు తదితర వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అభివృద్ధి పనులు  పూర్తి చేయండి

గూడూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు-నేడు’లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజబాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన గూడూరు, తరకటూరు గ్రామాల్లో పర్యటించి పలు పాఠశాలల్లో పనులను తనిఖీ చేశారు. తరకటూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మొత్తం రూ.68.94 లక్షల విలువైన పనుల్లో ఇప్పటివరకు రూ.20.89 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. పాఠశాలల్లో పలువురికి రక్తహీనత సమస్య ఉన్నట్లు తెలుసుకుని వారి ఇళ్లకు వెళ్లి ఐరన్‌ మాత్రలు అందిస్తున్నారా లేదా అంటూ వైద్యసిబ్బందిని ప్రశ్నించారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో ఆంగ్ల అక్షరాలు చెప్పించారు. చిన్నారులకు పెన్సిళ్లు అందజేశారు. గూడూరు జడ్పీఉన్నత పాఠశాలలో పనులు పరిశీలించారు. విద్యాకానుక పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఎంపీపీ సంగా మధుసూధనరావు, సర్పంచులు లింగం సులోచనారాణి, చిన్నం వెంకటరమణమ్మ, ఎంపీటీసీ సభ్యుడు జక్కా ధర్మారాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి తాహెరాసుల్తానా, సమగ్రశిక్ష ఏపీసీ డా.ఎ.శేఖర్‌, డీవైఈవో యూవీ సుబ్బారావు, తహసీల్దారు జీవీ ప్రసాదు, ఎంపీడీవో సుబ్బారావు, ఎంఈవో సత్యసాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని