logo

ఎక్కడికక్కడే సహాయ కేంద్రాలు

ఒడిశా రాష్ట్రంలో సంభంవించిన రైలు ప్రమాద సంఘటన నేపథ్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

Published : 04 Jun 2023 03:58 IST

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రంలో సంభంవించిన రైలు ప్రమాద సంఘటన నేపథ్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించిన వారు ఎవరైనా ప్రమాదం బారినపడితే తగు సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ పి.రాజబాబు తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరు 08672-252572, 78934 29231 సంప్రదింవచ్చని ఓ ప్రకటనలో వివరించారు. ఈ నంబర్లు 24 గంటలపాటూ అందుబాటులో ఉంటాయన్నారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో...

రైలు ప్రమాద దుర్ఘటనలో ఎవరైనా జిల్లాకు చెందిన బాధితులుంటే వారి కోసం జిల్లా పోలీస్‌ శాఖాపరంగా సహాయ సహకారాలు అందించేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ పి.జాషువా తెలిపారు. పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌ ఇన్‌స్పెక్టర్‌ 83329 83792, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 94910 68906, ఎస్బీ ఎస్సై 96183 36684 నంబర్లును సంప్రదించాలని ఓ ప్రకటనలో కోరారు.

గుడివాడలో

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌ వద్ద జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా ప్రయాణికుల సమాచారం తెలుసుకోవడానికి గుడివాడలో శనివారం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. గుడివాడ హెల్ప్‌ డెస్క్‌కు ఆర్‌పీఎస్‌ఐ బి.వెంకటేశ్వర్లు 94406 27570, ఆర్‌పీహెచ్‌సీ కె.సి.ఎన్‌.శ్రీనివాసరావు 98662 21412కు లేదా రైల్వే పోలీస్‌ స్టేషన్‌ 08674-244352 నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని