logo

టిడ్కో ఇళ్లు అమ్ముకొని రూ.కోట్లు దోచుకున్నారు : తెదేపా

గుడివాడ మండలంలో నిర్మించిన 8912 టిడ్కో ఇళ్లలో పలువురు పేదలను అనర్హులుగా ప్రకటించి సుమారు 1600 ఇళ్లను ఎమ్మెల్యే కొడాలి నాని, అధికారులు కలిసి ఒక్కో ఇంటినీ రూ.4 లక్షలకు అమ్ముకొని రూ.60 కోట్లు అక్రమంగా ఆర్జించారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు.

Published : 04 Jun 2023 03:58 IST

మాట్లాడుతున్న రావి వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడ మండలంలో నిర్మించిన 8912 టిడ్కో ఇళ్లలో పలువురు పేదలను అనర్హులుగా ప్రకటించి సుమారు 1600 ఇళ్లను ఎమ్మెల్యే కొడాలి నాని, అధికారులు కలిసి ఒక్కో ఇంటినీ రూ.4 లక్షలకు అమ్ముకొని రూ.60 కోట్లు అక్రమంగా ఆర్జించారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టిడ్కో ఇళ్లను పేదలకు అందించింది ముమ్మాటికీ చంద్రబాబు నాయుడే అని.. కానీ ఎమ్మెల్యే నాని తామే అభివృద్ధి చేసినట్లు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. టిడ్కో కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించాకే లబ్ధిదారులకు అప్పగిస్తామంటున్న వైకాపా నాలుగేళ్లుగా ఏం చేస్తోందన్నారు. ఆస్పత్రి, పాఠశాల, పోలీసు స్టేషన్‌, రక్షిత మంచినీటి పథకం కూడా లేవన్నారు. సీఎం వస్తున్నారని రోడ్లేస్తే సరిపోదని.. తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాల్సిన భాధ్యత లేదా అని ప్రశ్నించారు. జగనన్న కాలనీ పేరుతో సేకరించిన 180 ఎకరాల్లో కూడా కనీస వసతులు లేక లబ్ధిదారులు అల్లాడుతున్నారన్నారు. తెదేపా పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మండల శాఖ అధ్యక్షుడు వాసే మురళీ, మాజీ కౌన్సిలర్లు పొట్లూరి కృష్ణా రావు, అడుసుమిల్లి శ్రీనివాస్‌, శొంఠి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని