logo

వైద్యానికి పెద్దపీట

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతిస్తోందని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారిణి డాక్టర్‌ శర్మిష్ట పేర్కొన్నారు.

Published : 07 Jun 2023 05:07 IST

అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న శర్మిష్ట

పెదకళ్లేపల్లి(మోపిదేవి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతిస్తోందని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారిణి డాక్టర్‌ శర్మిష్ట పేర్కొన్నారు. పెదకళ్లేపల్లిలో మంగళవారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. తీవ్రమైన అతిసారం నియంత్రణ పక్షోత్సవాలు (ఇడీసీఎఫ్‌) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5 నుంచి 17 వరకు పక్షోత్సవాలు నిర్వహించాలన్నారు. 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, జింక్‌ బిళ్లలు ఇచ్చి వివరించాలన్నారు. గర్భిణుల నమోదు, సులభంగా కాన్పు అయ్యేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. మందుల కొరత తదితరాలపై ఆరా తీశారు. వైద్యాధికారిణి డాక్టర్‌ హారిక, తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని