logo

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ఆదాయం రూ.6.59 లక్షలు

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం ఒక్కరోజే రూ. 6.59 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఏసీ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

Published : 07 Jun 2023 05:09 IST

స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డి, అడపా శేషగిరి తదితరులు

మోపిదేవి, న్యూస్‌టుడే: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం ఒక్కరోజే రూ. 6.59 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఏసీ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. శాంతి కల్యాణోత్సవంలో 53 మంది పాల్గొన్నారు. సుప్రభాత సేవలో 8, మహన్యాస ఏక రుద్రాభిషేకాల్లో 211, కాలసర్పదోష పూజల్లో 251, సాధారణ అభిషేకాల్లో 241, పాలపొంగళ్లు 60, తలనీలాలు 144, శీఘ్ర దర్శనంలో 418 మంది భక్తులు పాల్గొన్నారు. సేవల ద్వారా రూ.5.07 లక్షలు, శాశ్వత అన్నదానం, నిత్యాన్నదానం విరాళాలు రూ.35 వేలు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.80వేలు ఆదాయం వచ్చిందన్నారు.


స్వామి సేవలో మంత్రి పెద్దిరెడ్డి

మోపిదేవి, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషగిరి మంగళవారం మోపిదేవి శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించారు. ఆలయ మర్యాదలతో వారికి అధికారులు, రుత్వికులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వారు నాగదేవత పుట్ట వద్ద పూజలు చేసి స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, వైకాపా నాయకుడు కడవకొల్లు నరసింహారావు, మోపిదేవి సర్పంచి నందిగం మేరీ రాణి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రమేష్‌బాబు, ఆలయ ఏసీ నల్లం సూర్యచక్రధరరావు వారికి స్వామివారి చిత్రపటాలు, ప్రసాదాలు అందించి శేషవస్త్రంతో సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని