ఏపీలో మరో మూడు రోజులూ తీవ్ర ఉష్ణోగ్రతలు

ఏపీలో మరో మూడు రోజులపాటు సూర్యుడి ప్రతాపం కొనసాగనుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడు రోజులు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Published : 07 Jun 2023 10:21 IST

అమరావతి: ఏపీలో మరో మూడు రోజులపాటు సూర్యుడి ప్రతాపం కొనసాగనుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడు రోజులు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఉక్కపోత, తీవ్ర ఉష్ణోగ్రత పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 11 వరకు కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని