logo

చెరువులు చుట్టేసి.. కాలువలు కమ్మేసి

గన్నవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. సూరంపల్లి, కొండపావులూరు, గోపవరపుగూడెం, గొల్లనపల్లిలో అనధికార తవ్వకాలు జరుగుతున్నా.. కనీసం పట్టించుకునే వారే లేరని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 08 Jun 2023 05:32 IST

గొల్లనపల్లిలో ఇష్టారాజ్యంగా...

గన్నవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. సూరంపల్లి, కొండపావులూరు, గోపవరపుగూడెం, గొల్లనపల్లిలో అనధికార తవ్వకాలు జరుగుతున్నా.. కనీసం పట్టించుకునే వారే లేరని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండపావులూరు శివారు రాయకుంట, గొల్లనపల్లి, తేలప్రోలు గ్రామాల్లోని ఊర చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలిస్తూ.. రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా చేపడుతున్న తవ్వకాలు.. కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని వాపోతున్నారు. ముదిరాజుపాలెం శివారులో తాడిచెట్టు లోతు చేపట్టిన తవ్వకాలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా మట్టి లారీల రాకపోకలతో పోలవరం కుడి కాలువ రూపురేఖలే మారాయని పలువురు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం రెవెన్యూ, ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులు కన్నెత్తి చూడక పోవడం పలు విమర్శలకు తావిస్తోందంటున్నారు. చెరువులు, పోరంబాబు, పోలవరం మట్టిని విజయవాడ, గుడివాడ పరిసరాలకు తరలిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే.. ఎదురుదాడి చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మట్టి తరలింపుపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

కొండపావులూరు రాయకుంట చెరువులో

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని