హజ్ యాత్రకు ముస్లింల పయనం
రాష్ట్రంలో తొలిసారి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా హజ్ యాత్రికుల రాకపోకలు బుధవారం ప్రారంభమయ్యాయి.
యాత్రను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా
గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : రాష్ట్రంలో తొలిసారి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా హజ్ యాత్రికుల రాకపోకలు బుధవారం ప్రారంభమయ్యాయి. సుమారు 170 మంది ప్రయాణికులతో కూడిన స్పైస్‌జెట్ ప్రత్యేక విమాన సర్వీసును హజ్ కమిటీ ఛైర్మన్ షేక్ గౌసల్ ఆజాం, విమానాశ్రయ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, ఇతర మత పెద్దలతో కలిసి డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ప్రారంభించారు. తొలుత గుంటూరు జిల్లా నంబూరు మదరసాలో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్ నుంచి ప్రయాణికులు ప్రత్యేక బస్సుల్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. భద్రత తనిఖీలు పూర్తయిన తర్వాత విమానాశ్రయం నుంచి రాస్‌అల్‌ఖైమాకు హజ్‌యాత్రికుల విమానం బయలుదేరి వెళ్లింది. యాత్రికులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా.. క్యాంప్‌లో వసతులు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర మక్కా యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులందరూ భారతీయులతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఆకాంక్షిస్తూ యాత్రికులకు అంజాద్‌బాషా వీడ్కోలు పలికారు. బందోబస్తు ఏర్పాట్లను డీఎస్పీ జయసూర్య, వెంకటరత్నం, సీఐ కనకారావు, ఎస్సై నాగరాజు తదితరులు పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!