logo

హడావుడి పనులు... పైపులైను లీకులు

కృష్ణాజిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెంలో సీఎం జగన్‌ ఈనెల 9న టిడ్కో ఇళ్లు ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 08 Jun 2023 05:32 IST

రోడ్డుపై వృథాగా పోతున్న నీరు

గుడివాడ(నెహ్రూచౌక్‌), న్యూస్‌టుడే: కృష్ణాజిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెంలో సీఎం జగన్‌ ఈనెల 9న టిడ్కో ఇళ్లు ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పనుల్లో లోపాలు బయట పడుతున్నాయి. బుధవారం కాలనీకి వెళ్లే ప్రధాన పైపులైనుకు భారీగా లీకు ఏర్పడింది. దీంతో వేలాది లీటర్ల తాగునీరు వృథాగా రోడ్డు పాలైంది. మందపాడులోని ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి నేరుగా మల్లాయపాలెంలోని టిడ్కో ఇళ్లకు నీరు అందించేందుకు ప్రధాన పైపులైను ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దీనికి ట్రయిల్‌ రన్‌ కూడా వేయకుండా నీటిని పంపింగ్‌ చేయడంతో గుడివాడ పట్టణంలోని సత్యనారాయణపురం వద్ద ప్రధాన పైపులైను జాయింట్‌ వద్ద లీకు ఏర్పడింది. దీంతో నీరు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎగజిమ్మింది. చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందారు. లీకైన తాగునీటితో రోడ్డు చెర్వును తలపించింది. విషయం తెలుసుకున్న అధికారులు పైపులైనుకు మరమ్మతులు చేస్తున్నారు. గురువారం కల్లా పూర్తి చేస్తామని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని