శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పి.జాషువా హెచ్చరించారు.
అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్ రాజబాబు, పక్కనే ఎస్పీ జాషువా తదితరులు
గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే:c స్థానిక టిడ్కో కాలనీలో కలెక్టర్ పి.రాజబాబు, ఎస్పీ జాషువా, ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య(నాని)లు వివిధ శాఖల అధికారులతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సుమారు 9 వేల మంది గృహప్రవేశాలు చేసే శుభ సందర్భం ఇదని, ఇక్కడ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి టిడ్కో కాలనీలో పోలీసు సిబ్బందిని నియమించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాలు కేటాయించామని, అక్కడ డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతి పెద్ద గృహ సముదాయాన్ని గుడివాడలో సీఎం ఈనెల 9న ప్రారంభిస్తారని చెప్పారు. 20 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి లాంఛనంగా ఫ్లాట్లను అప్పగిస్తారని, మిగిలిన వారికి అధికారులు అందజేసి గృహప్రవేశాలు చేయిస్తారన్నారు.
600 బస్సుల ఏర్పాటు...ముఖ్యమంత్రి సభకు గుడివాడ పట్టణం, పరిసర గ్రామాల నుంచి ప్రజలను తరలించడానికి సుమారు 600 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. వార్డుకు మూడు బస్సుల జనాన్ని తరలించడానికి సిద్ధమవుతున్నారు. సభావేదిక వద్ద గత రాత్రి కురిసిన వర్షానికి బురద మయం కాగా...ఫ్లైయాష్ పరిచి చదును చేశారు. హెలీప్యాడ్‌ను వేగంగా నిర్మిస్తున్నారు. సీఎం హెలీప్యాడ్ నుంచి సభావేదిక వద్దకు వచ్చి తిరిగి అక్కడకు వెళ్లే మార్గంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
సిద్ధమవుతున్న సభావేదిక
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి