సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు. బుధవారం పలువురు నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు.
వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు. బుధవారం పలువురు నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న వైఖరి తగదని, విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న జీవో 117ను తక్షణం రద్దు చేయాలని, బోధనేతర పనులనుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని, రెగ్యులర్ ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాలని, పీఆర్‌సీ ఇతర బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించడంతోపాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు 11వ పీఆర్సీకి అనుగుణంగా పెంచాలని, చట్టబద్ధమైన 12వ పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలన్నారు. డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఫ్యాప్టో నాయకులు మద్ది బాబూరాజేంద్రప్రసాద్, డి.అశోక్‌కుమార్, బి.లంకేష్, కనకారావు, ఇవీ రామారావుతోపాటు ఉమామహేశ్వరరావు, లెనిన్‌బాబు, సాంబశివరావు, అంబటిపూడి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్‌లో లులు మాల్
-
‘నా పెద్ద కొడుకు’ అరెస్టుతో ఆకలి, నిద్ర ఉండడం లేదు
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం