ఆపేయండి..!
ఏ ప్రభుత్వమైనా అభివృధ్ధి పనులు పూర్తిచేస్తామని చెప్తుంది. వైకాపా ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా పునాదుల దశలో ఉన్న సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్‌క్లినిక్‌ల భవన నిర్మాణాల పనులను ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం విచిత్రంగా ఉంది.
ప్రభుత్వ ఆదేశాలతో గందరగోళం
మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే
బంటుమిల్లిలో పునాదుల దశలో రైతుభరోసా కేంద్ర భవనం
ఏ ప్రభుత్వమైనా అభివృధ్ధి పనులు పూర్తిచేస్తామని చెప్తుంది. వైకాపా ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా పునాదుల దశలో ఉన్న సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్‌క్లినిక్‌ల భవన నిర్మాణాల పనులను ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం విచిత్రంగా ఉంది. వాటిని అసంపూర్తిగానే వదిలేస్తారా? ఏమి చేస్తారు..పరిస్థితి ఏమిటనే అనుమానాలు ప్రజలనుంచి వ్యక్తమవుతున్నాయి.
ప్రారంభం కానివి 303.. పునాదుల్లో 302
జిల్లా వ్యాప్తంగా 387 సచివాలయాలకు భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయించినట్లు ప్రకటించడంతోపాటు పలు చోట్ల పనులు ప్రారంభించారు. ఏళ్లు గడిచిపోతున్నా ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో అసంపూర్తిగానే ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో 10 భవనాలు ఇంకా ప్రారంభోత్సవానికి కూడా నోచుకోలేదు.78 భవనాలు పునాదుల దశలోనే మిగిలిపోయాయి. కేవలం 170 మాత్రమే పూర్తవగా మిగిలినవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. పనుల ప్రారంభంలోనే స్థల సేకరణ సమస్యతో కొంత జాప్యం జరిగింది. తరువాత ఆ సమస్య పరిష్కారమైనా వివిధ కారణాలతో నిర్మాణాలు సక్రమంగా సాగడం లేదు. 378 రైతుభరోసా కేంద్రాలకు భవనాలు నిర్మించాలని నిర్ణయించగా కేవలం 97 మాత్రమే పూర్తయ్యాయి. 54 భవనాల పనులు అసలు ప్రారంభించలేదు. 138 పునాదుల దశలో ఉంటే మిగిలినవి వివిధ స్థాయిలో ఉండగా కొన్ని చోట్ల చేపట్టినవి కూడా ఆగిపోయాయి. 268 వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌లకు గానూ 67 కేంద్రాలకు భవనాలు నిర్మించారు. 85 భవనాలు పునాదుల స్థాయిలో ఉంటే 44 కేంద్రాల నిర్మాణాలు ఇంతవరకు చేపట్టలేదు. బల్క్‌మిల్క్‌చిల్లింగ్ సెంటర్లు, డిజిటల్ గ్రంథాలయాల ఊసే ఎత్తడం లేదు. 53 మిల్క్‌చిల్లింగ్ కేంద్రాలకు ఇంతవరకు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఒకటి రెండు చోట్ల మినహా అసలు పనులే ప్రారంభించలేదు. 150 డిజిటల్ గ్రంథాలయాలకు భవనాలు నిర్మించాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే పూర్తయ్యింది. ఇలా అన్నీ కలిపి 1236కుగాను 303 భవనాల పనులు అసలు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. 302 మాత్రం పునాదుల దశలో ఉన్నాయి.
ఎందుకో ఆ నిర్ణయం
ప్రభుత్వ ఆదేశాలతో ప్రారంభం కానివి, పునాదుల దశలో ఉన్నవాటన్నింటినీ ఆపి మిగిలిన భవనాల పనులు పూర్తి చేసేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఒక్కో సచివాలయ భవనానికి రూ.40లక్షలు, రైతుభరోసా కేంద్రానికి రూ.21.80లక్షలు, హెల్త్‌క్లినిక్‌కు రూ.17.50లక్షల చొప్పున వెచ్చించాల్సి ఉంది. ఇలా అన్ని భవనాలకు నిధులు కేటాయించారు. సకాలంలో విడుëల చేయకపోవడం సమస్యగా మారింది. ప్రారంభంలో అనేకమంది గుత్తేదారులు హడావుడిగా పనులు ప్రారంభించడంతోపాటు కొన్ని చోట్ల పూర్తికూడా చేశారు. తరువాత నిధులు విడుదల కాకపోవడం అప్పటికే పెట్టిన పెట్టుబడి భారంగా మారడంతో మిగిలిన పనులు చేయకుండా వదిలేశారు. ఇంకొన్ని చోట్ల స్థల సేకరణ సమస్యగా మారడంతో పనులు ప్రారంభించకుండా వదిలేశారు. ఉన్నట్టుండి పునాదుల దశలో ఉన్న భవనాల నిర్మాణాలను ఆపేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధుల కొరతతోనే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారన్న వ్యాఖ్యలు గుత్తేదారులు అంటున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో భవనాలు లేక స్థానికంగా ఉన్న ప్రభుత్వ భవనాలు, అద్దె గదుల్లో నిర్వహిస్తున్నారు. అద్దెలు చెల్లించక పలు ప్రాంతాల్లో యజమానులు తాళాలు వేసిన సంఘటనలు కూడా జిల్లాలో ఉన్నాయి. ఎప్పటికైనా పూర్తి చేస్తారులే అనుకుంటున్న తరుణంలో ఆపేయాలని చెబితే అది సేవలపై కూడా ప్రభావం చూపుతుందని ప్రజలు వాపోతున్నారు.
త్వరితగతిన పూర్తి: విజయకుమారి, పీఆర్ ఎస్‌ఈ
జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.పునాదుల దశలో ఉన్న వాటి పనులు ఆపేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. తొలుత వివిధ దశల్లో ఉన్న భవనాలన్నింటినీ వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నది లక్ష్యం. ఈఏడాది సెప్టెంబరులో అవి పూర్తి చేసి, తరువాత మిగిలిన భవనాల వాటిని కూడా చేపడతాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తి చేసేలా కృషి చేస్తున్నాం.
బందరు మండలం సుల్తానగరంలో అసంపూర్తిగా సచివాలయ భవనం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ