logo

వాణిజ్య ఉద్యోగుల సుదీర్ఘ విచారణ

వాణిజ్య పన్నుల శాఖలో లొసుగులను అడ్డం పెట్టుకుని డీలర్లు, గుత్తేదారులు, వ్యాపారులను బెదిరించి అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలతో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు కె.సంధ్య, మెహర్‌కుమార్‌, చలపతి, సత్యనారాయణలను పటమట పోలీసులు గురువారం రెండో రోజు కస్టడీకి తీసుకుని విచారించారు.

Published : 09 Jun 2023 04:39 IST

విచారణ అనంతరం సబ్‌ జైలుకు ఉద్యోగి తరలింపు

పటమట, న్యూస్‌టుడే: వాణిజ్య పన్నుల శాఖలో లొసుగులను అడ్డం పెట్టుకుని డీలర్లు, గుత్తేదారులు, వ్యాపారులను బెదిరించి అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలతో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు కె.సంధ్య, మెహర్‌కుమార్‌, చలపతి, సత్యనారాయణలను పటమట పోలీసులు గురువారం రెండో రోజు కస్టడీకి తీసుకుని విచారించారు. పోలీసుల పిటిషన్‌ మేరకు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు పటమట పోలీసులు.. నిందితులను విజయవాడ సబ్‌ జైల్‌ నుంచి తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి 11 గంటల సమయంలో పటమట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం ఏసీపీ భాస్కరరావు, పటమట ఇన్‌స్పెక్టర్‌ కాశీవిశ్వనాథ్‌లు నిందితులను న్యాయవాదుల సమక్షంలో విచారించారు. వాణిజ్య పన్నుల శాఖలోని ఇంటెలిజెన్స్‌ విభాగం తారుమారైన దస్త్రాలు, డీలర్లు, జీరో వ్యాపారం చేసే వ్యాపారుల వివరాలతో పాటు పలు కీలక విషయాలపై విచారించినట్లు సమాచారం. సాయంత్రం 6 గంటల వరకు విచారణ సాగింది. కోర్టు షరతుల ప్రకారం.. పోలీసులు కస్టడీకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఉంది. కానీ సాయంత్రం 6 గంటల వరకు పోలీసుల విచారణ సాగింది. అనంతరం నిందితులను తీసుకుని సాయంత్రం 6.05 గంటలకు పోలీస్‌ స్టేషన్‌ నుంచి సబ్‌ జైల్‌కు బయలుదేరారు. శుక్రవారంతో పోలీసులు కస్టడీ ముగియనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని