హామీకి ఏడు నెలలు.. అమలు ఇంకెన్నాళ్లు..?
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవనిగడ్డ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలు ఏడు నెలలు పూర్తయినా కార్యరూపం దాల్చలేదు. ఎమ్మెల్యే రమేష్‌బాబు అడిగిన దానికల్లా నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి ప్రజలను నమ్మించారు.
కుడి కరకట్టపై ప్రమాదకరంగా గండ్లు
కృష్ణా నది కుడి, ఎడమ కరకట్టల మరమ్మతులకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాను. వీలైనంత తొందరగా పనులు ప్రారంభిస్తాం.
2022 అక్టోబర్ 20న అవనిగడ్డ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన
న్యూస్‌టుడే, అవనిగడ్డ; ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవనిగడ్డ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలు ఏడు నెలలు పూర్తయినా కార్యరూపం దాల్చలేదు. ఎమ్మెల్యే రమేష్‌బాబు అడిగిన దానికల్లా నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి ప్రజలను నమ్మించారు. ఆ హామీలు ఇప్పటికీ అమలు చేయకపోవడంతో కృష్ణా నది కుడి, ఎడమ కరకట్టలకు గండ్లుపడి, గుంతలు, బీటలు వారుతున్నా పనులు ప్రారంభించకపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల కరకట్టపై పెద్ద గుంతలు పడి ప్రమాదకరంగా తయారైంది. కరకట్టపై ట్రాక్టర్లు వెళ్లే అవకాశం లేదు. గత ప్రభుత్వ హయాంలో కరకట్టపై కంకర, ఫ్లైయాష్ వేసి జంగిల్ తొలగించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ జంగిల్ తొలగింపు తప్ప కరకట్ట పటిష్టం చేసిన దాఖలాలు లేవు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కృష్ణా నదికి వరదలు వచ్చే ఆస్కారం ఉంది. దీంతో వెంటనే కరకట్టకు మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.
ఎడమ కరకట్టపై గుంతలు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)