చేపల చెరువుల తవ్వకాల అడ్డగింత
చేపల చెరువుల తవ్వకాలతో పొలాలు బీడువారి, తాగునీటి వనరులు కలుషితమవుతాయంటూ పురిటిపాడు గ్రామస్థులు చెరువుల తవ్వకాలను అడ్డుకున్నారు.
అడ్డుకుంటున్న గ్రామస్థులు, సర్పంచి నరేంద్ర
పురిటిపాడు(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: చేపల చెరువుల తవ్వకాలతో పొలాలు బీడువారి, తాగునీటి వనరులు కలుషితమవుతాయంటూ పురిటిపాడు గ్రామస్థులు చెరువుల తవ్వకాలను అడ్డుకున్నారు. కలెక్టరేట్‌తో సహా ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. పురిటిపాడు, చినగొన్నూరు ఎస్సీవాడల పక్కనే ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవరం గ్రామ పొలాలున్నాయి. పురిటిపాడు ఎస్సీవాడ నివాసాల పక్కనే ఎర్నేని సీతాదేవి కాల్వ ఉంది. ఈ కాల్వను ఆనుకునే దేవరం పొలాలున్నాయి. కొంతకాలం కిందట ఇక్కడ 32 ఎకరాలను తవ్వి చేపల చెరువులుగా మార్చేందుకు ప్రయత్నాలు చేయగా పురిటిపాడు గ్రామస్థులు, రైతులు అప్పట్లో కృష్ణా జిల్లాలో ఉన్న ముదినేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అభ్యంతర పత్రాలు అందజేశారు. శుక్రవారం ఆ ప్రాంతంలోని 32 ఎకరాల్లో పొక్లెయిన్‌తో తవ్వకాలు చేపట్టారు. దీంతో గ్రామస్థులు, సర్పంచి కాగిత నరేంద్ర తదితరులు అభ్యంతరం తెలిపారు. అనంతరం అధికారులకు సమాచారమిచ్చారు. వీఆర్వో వచ్చి నిలిపివేయాలని సూచించారు. పచ్చని పంట పొలాలను నాశనం చేసేలా చేపల చెరువుల తవ్వకాలు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని, తాగునీరు కూడా లభించదని ధ్వజమెత్తారు. అనంతరం రైతులు ముదినేపల్లి తహసీల్దార్ కార్యాయలంలో, కైకలూరు మత్స్యశాఖ కార్యాలయంలో, ఏలూరు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)