చట్ట సభలకు పంపించే పార్టీకే మద్దతు
చట్టసభల్లో తమకు ప్రాతినిధ్యం కల్పించిన పార్టీకే మద్దతు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్‌బాషా సంఘం అధ్యక్షుడు కె.పీర్ మహ్మద్ అన్నారు.
ఐక్యత చాటుతున్న నూర్‌బాషా సంఘం నాయకులు
ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: చట్టసభల్లో తమకు ప్రాతినిధ్యం కల్పించిన పార్టీకే మద్దతు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్‌బాషా సంఘం అధ్యక్షుడు కె.పీర్ మహ్మద్ అన్నారు. ఏలూరు పవరుపేటలోని ఎస్‌ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సంఘం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీర్‌మహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 18 నుంచి 22 లక్షల మంది సంఘ సభ్యులున్నారని, ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ తమకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. ఓట్లు దండుకుని తర్వాత నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి సత్తా చాటుతామన్నారు. రాజకీయంగా అవకాశం కల్పించి ఏ పార్టీ తమను చట్టసభలకు పంపిస్తుందో దానికే మద్దతు ఉంటుందన్నారు. సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎస్‌ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా త్వరలో 15 వేల మంది ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మస్తానమ్మ తదితరులు మాట్లాడారు. అనంతరం పీర్ మహ్మద్, ఎస్‌ఎంఆర్ పెదబాబులను సత్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కే సలీమ్, వివిధ జిల్లాల అధ్యక్షులు మహ్మద్ ఖాజా, కరీముల్లా వలీ, సిద్ధయ్య, నాగూర్, మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)