logo

విద్యలవాడలో విజ్ఞాన సౌరభం

మహాత్మాగాంధీరోడ్డులోని రామ్మోహన గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక వితరణ కార్యక్రమం ప్రారంభించారు. పలువురు దాతలు, రచయితలు తమ వద్ద ఉన్న వందలాది పుస్తకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న లక్ష్యంతో గ్రంథాలయానికి అందించారు.

Published : 10 Jun 2023 05:34 IST

పుస్తకాలను ఎంచుకుంటున్న పాఠకులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీరోడ్డులోని రామ్మోహన గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక వితరణ కార్యక్రమం ప్రారంభించారు. పలువురు దాతలు, రచయితలు తమ వద్ద ఉన్న వందలాది పుస్తకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న లక్ష్యంతో గ్రంథాలయానికి అందించారు. వీటిని శుక్రవారం ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇందులో విద్యా సంబంధమైన పుస్తకాలతోపాటు నవలలు, పిల్లల కథలు, ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, వాణిజ్య శాస్త్రం, వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడేవి ఉన్నాయి. పుస్తక వితరణ కార్యక్రమాన్ని గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు చింతలపూడి కోటేశ్వరరావు ప్రారంభించారు. గ్రంథాలయ కార్యదర్శి వేములపల్లి కేశవరావు, ఉపాధ్యక్షుడు దమ్మాల రామచంద్రరావు పర్యవేక్షించారు. దాదాపు 200 మందికి పైగా పాఠకులు, విద్యార్థులు వచ్చి తమకు నచ్చిన పుస్తకాలను తీసుకు వెళ్లారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. శని, ఆదివారాల్లోనూ వితరణ కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని