ఈదురుగాలుల బీభత్సం
ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులకు గుంటుపల్లి-సూరాయపాలెం మధ్య జాతీయ మార్గంలో పెద్ద వృక్షాలు విరిగి రోడ్డుకడ్డంగా పడ్డాయి.
గుంటుపల్లి-సూరాయపాలెం మార్గంలో కూలిన భారీ చెట్టు
ఇబ్రహీంపట్నం గ్రామీణం, గొల్లపూడి, న్యూస్‌టుడే: ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులకు గుంటుపల్లి-సూరాయపాలెం మధ్య జాతీయ మార్గంలో పెద్ద వృక్షాలు విరిగి రోడ్డుకడ్డంగా పడ్డాయి. ఫలితంగా తుమ్మలపాలెం, గొల్లపూడి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వందలాది వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం, భవానీపురం పోలీసులు రోడ్డుపై కూలిన వృక్షాలు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గుంటుపల్లి నుంచి రాయనపాడు, నల్లకుంట మీదుగా గొల్లపూడి వైపునకు వాహనాలు మళ్లించారు. వందలాది వాహనాలు ఒకేసారి రావడంతో నల్లకుంట నుంచి మైలురాయి సెంటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రి వరకు వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసాద్, ఏసీపీ ఆర్.రామచంద్రరావు, సీఐ పి.రామచంద్రరావు, సిబ్బంది పర్యవేక్షించారు. మరోవైపు గుంటుపల్లిలోని ఎన్టీఆర్ రోడ్డులో రెండు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా గుంటుపల్లి వ్యాగన్ వర్కుషాపు కాలనీతో పాటు రామకృష్ణనగర్ పరిసర ప్రాంతాలలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు శాఖ ఏఈ శ్రీనివాసరావు అధ్వర్యంలో సిబ్బంది యుద్ధప్రాతిపదికన విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)