logo

మాకో దారి చూపండి మహాప్రభో..

 మోపిదేవి మండలం వెంకటాపురంలో ఎన్‌టిఆర్‌ కాలనీ, జగనన్న కాలనీలకు ప్రధాన దారిలేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.

Updated : 18 Sep 2023 05:24 IST

న్యూస్‌టుడే, మోపిదేవి: మోపిదేవి మండలం వెంకటాపురంలో ఎన్‌టిఆర్‌ కాలనీ, జగనన్న కాలనీలకు ప్రధాన దారిలేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆరు నెలల క్రితం పూర్తి చేశారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు బురదలోనే కాలనీలోకి వెళ్లారు. రెండు కాలనీలు కలిసే ఉన్నా ప్రధాన రహదారులు లేవు. మొత్తం 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డునే ఉపయోగిస్తున్నారు. రహదారిని అభివృద్ధి చేసి సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు. విద్యార్థులు సైకిళ్లను భుజాన వేసుకొని వెళ్లాల్సి వస్తోంది. గడప గడపలో సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించిన ప్రభుత్వం తమ కాలనీలో సమస్యను పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని