logo

అత్యాచార నిందితుడిపై బాధితురాలి బంధువుల దాడి

యువతిపై అత్యాచారం చేశాడనే కారణంతో నిందితుడిపై బాధితురాలి బంధువులు దాడి చేసిన వైనం ఇది.

Published : 21 Sep 2023 04:37 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: యువతిపై అత్యాచారం చేశాడనే కారణంతో నిందితుడిపై బాధితురాలి బంధువులు దాడి చేసిన వైనం ఇది. స్థానికుల కథనం ప్రకారం గుడివాడ పట్టణానికి చెందిన ఓ యువతికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో ఆమె, కాబోయే భర్త ఈనెల 8న గుడివాడ రూరల్‌ మండలం బొమ్ములూరు గ్రామ శివారులోని మురికి కాలువ వద్దకు ఏకాంతంగా గడిపేందుకు వెళ్లారు. ఆ సమయంలో బొమ్ములూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జంటలోని యువకుడిని కట్టి పడేసి అతని ముందే యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారని సమాచారం. అయితే ఇది బయటకు వస్తే యువతి పెళ్లి ఆగిపోతుందనే భయంతో బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అప్పటి నుంచి వారు అత్యాచారానికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. బుధవారం నిందితులైన యువకులు వారికి కన్పించారు. వారిని పట్టుకొనే ప్రయత్నంలో ఒకరు పరారైనట్లు చెబుతున్నారు. మరొకతను మాత్రం వారికి దొరికాడు. దీంతో యువతి బంధువులు అతడిని చితక బాదారు. స్థానికులు అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని