logo

ఆగిన వాహనం... గంటన్నర నరకం...

బస్సు టైర్లు పగలడంతో కనకదుర్గమ్మ వారధిపై ట్రాఫిక్‌ నిలిచిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కర్ణాటక రిజిస్ట్రేషన్‌ నంబరు గల ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బుధవారం...

Published : 21 Sep 2023 05:13 IST

ఇరుక్కుపోయిన అంబులెన్స్‌

స్సు టైర్లు పగలడంతో కనకదుర్గమ్మ వారధిపై ట్రాఫిక్‌ నిలిచిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కర్ణాటక రిజిస్ట్రేషన్‌ నంబరు గల ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్తోంది. వారధి 15వ నంబరు ఖానా వద్ద ఒక్కసారిగా బస్సు వెనుక టైరు పగిలింది. అనంతరం రెండో టైరు కూడా పగలడంతో కొద్ది దూరం రిమ్ము ఆధారంగానే బస్సు ముందుకు సాగింది. టైర్లు పగిలిపోవడంతో అక్కడివారంతా భయాందోళనలు చెందారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ సీఐ జానకిరామయ్య నేతృత్వంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎట్టకేలకు క్రేన్‌ ఘటనా స్థలానికి చేరుకొని బస్సును తరలించడంతో 11 గంటలకు వాహనాలు ముందుకు సాగాయి.

ఈనాడు, అమరావతి - కృష్ణలంక, న్యూస్‌టుడే

టైర్లు పగిలిన ట్రావెల్స్‌ బస్సు

బెంజిసర్కిల్‌ పైవంతెన వరకూ ఆగిపోయిన వాహనాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని