logo

బీఎస్‌ఎన్‌ఎల్‌ సీజీఎం బాధ్యతల స్వీకరణ

బీఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజరు(సీజీఎం)గా ఎం.శేషాచలం బుధవారం విజయవాడ నగరం, చుట్టుగుంటలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Published : 21 Sep 2023 05:13 IST

శేషాచలం

విజయవాడ (చుట్టుగుంట), న్యూస్‌టుడే : బీఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజరు(సీజీఎం)గా ఎం.శేషాచలం బుధవారం విజయవాడ నగరం, చుట్టుగుంటలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సీజీఎంగా పనిచేసిన బి.సురేష్‌ కృష్ణ జూన్‌లో పదవీ విరమణ చేశారు. దీంతో సీనియర్‌ పీజీఎం బి.రవికుమార్‌ ఇన్‌ఛార్జి సీజీఎంగా కొనసాగారు. హైదరాబాద్‌లో ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ (పీజీఎం)గా పనిచేస్తున్న ఎం.శేషాచలం.. సీజీఎంగా ఉద్యోగోన్నతిపై విజయవాడకు బదిలీ అయ్యారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. భారత టెలికమ్యూనికేషన్‌ సర్వీస్‌ 1989 బ్యాచ్‌కు చెందిన శేషాచలం.. టెలికామ్‌ సర్వీస్‌లో చేరకముందు ఇస్రోలో, బెంగళూరులోని ఐఎస్‌ఏసీలో శాస్త్రవేత్తగా సేవలందించారు. ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌, ఆపరేషన్స్‌, ప్లానింగ్‌, సేల్స్‌, మొబైల్‌ శాఖల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో పని చేయడంలో అపార అనుభవం ఉంది. మీ మొబైల్‌ నెంబరును ఎంచుకోండి, మొబైల్‌ నంబరు పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ)రూపకల్పనలు వంటి సంచలనాత్మక విజయాలు ఆయన సొంతం. బీఎస్‌ఎన్‌ఎల్‌ మొదటి కాల్‌ సెంటర్‌, ప్రాజెక్ట్‌ విజయ్‌ ద్వారా సిమ్‌ అమ్మకాలు పెంచడం వంటి... అత్యుత్తమ సేవలు అందించారు. సాంకేతికానుభవంతో పాటు నిర్వాహక, పరిపాలనా విభాగాల్లో నైపుణ్యాలు కలిగి ఉన్నారు. భారత్‌ నెట్‌ కనెక్షన్లు, ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌లో వృద్ధి పెంచడంతో పాటు నాణ్యమైన సేవలు మెరుగుపరచడం, ఉత్తమ కస్టమర్‌ సేవలు అందించి సంస్థను ఆదాయం పెంచడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని కార్యాలయ ఎస్‌డీఈ, పీఆర్‌ ఎస్‌.రామారావు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని