logo

శ్రేణులు ఒక్కటై.. పోరాట యోధులై...

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెదేపా శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల్లో నిరసనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి.

Updated : 21 Sep 2023 06:06 IST

చంద్రబాబు అరెస్టుపై నిరసనలు ఉద్ధృతం

మోపిదేవి: పెదకళ్లేపల్లిలో మండలి వెంకట్రామ్‌ ఆధ్వర్యంలో తెదేపా, జనసేన నాయకుల కొవ్వొత్తుల ప్రదర్శన

ఈనాడు, అమరావతి: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెదేపా శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల్లో నిరసనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ శాంతియుతంగా దీక్షలు చేపట్టి.. అనంతరం. కొవ్వొత్తుల ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలతో తమ నిరసన తెలియజేస్తున్నారు. తెదేపా ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు, సామాన్య ప్రజలు సైతం అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ శిబిరాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. తెదేపా బీసీ, రైతు విభాగాల ఆధ్వర్యంలో బుధవారం పలు నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యేదాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

  • మచిలీపట్నం తెదేపా కార్యాలయంలో బీసీ, రైతు విభాగాల ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు.
  • గన్నవరం తెదేపా కార్యాలయం ఆవరణలో చేపడుతున్న నిరాహార దీక్ష శిబిరంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
  • గుడివాడలో తెదేపా ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎనిమిదో రోజు దీక్షలు కొనసాగాయి. పట్టణ తెదేపా అధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
  • పామర్రు నియోజకవర్గలోని కూచిపూడి సెంటర్‌లో నిర్వహించిన నిరసన దీక్షలో పార్టీ ఇన్‌ఛార్జి వర్ల కుమార్‌రాజా పాల్గొన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి సంఘీభావం తెలిపారు.
  • అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. తెదేపా, జనసేన నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
  • పెనమలూరు పార్టీ కార్యాలయంలో బీసీ విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌: మూల్పూరి కల్యాణి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

పామర్రు గ్రామీణం: కొమరవోలులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

మచిలీపట్నం: నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న కొల్లు రవీంద్ర

గుడివాడ: రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తెదేపా బీసీ నేతలు

మచిలీపట్నం: తెదేపా నియోజకవర్గ కార్యాలయం వద్ద దీక్షలో బూరగడ్డ వేదవ్యాస్‌, బాబాప్రసాద్‌ తదితరులు

పోరంకి: బీసీల రిలే దీక్షలో పోస్టుకార్డులు ప్రదర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, తెదేపా నేతలు

పెడన: చంద్రబాబు విడుదల కావాలని కొబ్బరికాయలు కొట్టిన కాగిత కృష్ణప్రసాద్‌, నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని