logo

నినదిస్తూ.. నిలదీస్తూ..

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో తెదేపా శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. పార్టీ ముఖ్యనాయకులు... కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఈ నిరసనల్లోపాల్గొంటున్నారు.

Updated : 23 Sep 2023 06:17 IST

ఉయ్యూరు: వైవీబీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే బృందం : కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో తెదేపా శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. పార్టీ ముఖ్యనాయకులు... కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఈ నిరసనల్లోపాల్గొంటున్నారు. తమ అధినేత చంద్రబాబును వేధింపులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కేసులను ముఖ్యమంత్రి జగన్‌ పెట్టిస్తున్నారంటూ తెదేపా నాయకులు పేర్కొంటున్నారు. చంద్రబాబుకు తోడుగా మేమున్నామని.. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తున్నారు.

పామర్రు: నిమ్మకూరులో ఎన్టీఆర్‌ దంపతుల విగ్రహాల వద్ద తెదేపా,జనసైనికుల నిరసన

  • గుడివాడ తెదేపా కార్యాలయంలో తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు నల్ల కండువాలు వేసుకుని దీక్షా శిబిరంలో కూర్చున్నారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి పాల్గొని సంఘీభావం తెలిపారు. చంద్రబాబుకే తమ మద్దతు అని పోస్ట్‌కార్డుల ఉద్యమాన్ని నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావు ఆరంభించారు.రి పెనమలూరు నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు దీక్షలో పాల్గొనగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ హాజరయ్యారు.
  • మచిలీపట్నం నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చొని నిరసన తెలియజేశారు.రి పామర్రు నియోజకవర్గం.. నిమ్మకూరులో నందమూరి తారక రామారావు దంపతుల విగ్రహాల వద్ద గ్రామ సర్పంచి పడమట శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కలిసి నిరసన తెలియజేశారు. పమిడిముక్కలలో తెదేపా, జనసేన నాయకులతో కలిసి నిర్వహించిన రిలే దీక్షలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్ల కుమార్‌రాజా పాల్గొన్నారు. రి అవనిగడ్డలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.రి గన్నవరం నియోజకవర్గంలో తెదేపా కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు చేయగా... తెలుగు యువత జిల్లా దండమూడి చౌదరి పాల్గొన్నారు. మండల అధ్యక్షలు జాస్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
  • పెడనలో తెదేపా బాధ్యుడు కాగిత కృష్ణప్రసాద్‌, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదవ్యాస్‌ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు.

మచిలీపట్నం: దీక్షా శిబిరం వద్ద సర్వమత ప్రార్థనల్లో కొల్లు రవీంద్ర, శ్రేణులు

పెనమలూరు: బోడే ప్రసాద్‌ ఆధ్వర్యంలో...

విజయవాడ తూర్పు: నల్ల బెలూన్లు వదిలి నిరసన తెలుపుతున్న గద్దె అనురాధ, నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని