logo

ఉద్యోగాలు క్రమబద్ధీకరించకపోతే నిరవధిక సమ్మె

ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయకపోతే నిరవధిక సమ్మెకు మున్సిపల్‌ కార్మికులు సిద్ధపడతారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌ కె.ధనలక్ష్మి హెచ్చరించారు.

Published : 23 Sep 2023 04:57 IST

రెండో రోజు రిలే నిరాహార దీక్షలో కె.ధనలక్ష్మి, మున్సిపల్‌ కార్మికులు, తదితరులు

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయకపోతే నిరవధిక సమ్మెకు మున్సిపల్‌ కార్మికులు సిద్ధపడతారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌ కె.ధనలక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం విజయవాడ ధర్నాచౌక్‌లో మున్సిపల్‌ కార్మికుల రెండో రోజు రిలే నిరాహర దీక్షలను ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారన్నారు. అధికారం చేపట్టాక నాటి హామీలను విస్మరించారని గుర్తు చేశారు. మున్సిపల్‌ కార్మికుల ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ నాయకులు టి.తిరుపతమ్మ, గార్లపాటి లక్ష్మి, ఏ.జాన్‌బాబు, చంద్రకళ, కె.వెంగమ్మ, సరళ, జె.విజయలక్ష్మి, రాజు, బాలరాజు, వరమ్మ, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని