logo

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్‌ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు యడ్రాతి కోటేశ్వరరావు మాదిగ డిమాండ్‌ చేశారు.

Published : 23 Sep 2023 04:57 IST

విజయవాడ ధర్నాచౌక్‌లో నాయకులు యడ్రాతి కోటేశ్వరరావు, లింగాల నరసింహులు, కూచిపూడి సత్యం తదితరుల నిరసన

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్‌ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు యడ్రాతి కోటేశ్వరరావు మాదిగ డిమాండ్‌ చేశారు. శుక్రవారం విజయవాడ ధర్నాచౌక్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్‌, ఎమ్‌ఎస్పీ, వీహెచ్‌పీఎస్‌ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయవాడ అర్బన్‌ ఎమ్మార్పీఎస్‌ కన్వీనర్‌ లింగాల నరసింహులు మాదిగ, ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌ఛార్జి కూచిపూడి సత్యంమాదిగ, అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరరావు మాదిగ, మంద పిచ్చయ్య, వీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గంటేటి సుజాత నాయుడు, ఎమ్‌ఎస్పీ సీనియర్‌ నాయకుడు కటికల సైదులు, మొండితోక విజయ్‌ మాదిగ, కోడి వంశీ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని