logo

పోలీసుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం

పోలీస్‌ సిబ్బంది సంక్షేమం, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్‌ వెల్ఫేర్‌ డే, డయల్‌ యువర్‌ సీపీ కార్యక్రమానికి పలు ఫిర్యాదులు వచ్చాయి.

Published : 23 Sep 2023 04:57 IST

సిబ్బంది సమస్యలు వింటున్న సీపీ కాంతిరాణాటాటా

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : పోలీస్‌ సిబ్బంది సంక్షేమం, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్‌ వెల్ఫేర్‌ డే, డయల్‌ యువర్‌ సీపీ కార్యక్రమానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. శుక్రవారం ఉదయం పోలీస్‌ సిబ్బంది సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహించిన పోలీస్‌ వెల్ఫేర్‌ డేలో సీపీ పాల్గొన్నారు. సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్‌ వెల్ఫేర్‌ డేలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఈ అవకాశాన్ని సిబ్బంది వినియోగించుకోవాలని సీపీ కోరారు.

డయల్‌ యువర్‌ సీపీకి 10 ఫిర్యాదులు

ప్రజల సమస్యలను ఫోన్‌ ద్వారా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సీపీకి 10 ఫిర్యాదులు వచ్చాయి. పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణాటాటా నేరుగా ఫోన్‌ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ట్రాఫిక్‌ సమస్యలు, అసాంఘిక శక్తుల కదలికలు, ఆర్థిక నేరాలు, స్థల వివాదాల గురించి మొత్తం 10 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కారం నిమిత్తం సంబంధిత విభాగాల అధికారులకు పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని