logo

పనులు ఆగి.. వాహనాలు దిగబడి

బాపులపాడు మండలం పెరికీడు నుంచి ఏలూరు జిల్లా పెదపాడు వెళ్లే ప్రధాన రహదారి పనుల నిర్వహణ ఘోరంగా తయారయ్యాయి. దాదాపు రూ.54 కోట్ల వ్యయంతో 18.6 కి.మీ మేర ఈ రహదారిని పునర్నిర్మించేందుకు నెలల కిందట పనులు చేపట్టారు.

Published : 27 Sep 2023 04:03 IST

రహదారికి ఓ వైపు అధ్వానంగా..

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే : బాపులపాడు మండలం పెరికీడు నుంచి ఏలూరు జిల్లా పెదపాడు వెళ్లే ప్రధాన రహదారి పనుల నిర్వహణ ఘోరంగా తయారయ్యాయి. దాదాపు రూ.54 కోట్ల వ్యయంతో 18.6 కి.మీ మేర ఈ రహదారిని పునర్నిర్మించేందుకు నెలల కిందట పనులు చేపట్టారు. ఆగుతూ, సాగుతూ చంధంగా నిర్మాణం జరుగుతుండటంతో వాహనదార్లు ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. తారు రోడ్డుగా ఉండే దీనిపై ఎక్కడికక్కడ గుంతలు పడటంతోపాటు, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బురద మేట వేసుకుపోయింది. ఈ విషయాన్ని ‘ఈనాడు’ పలుమార్లు వార్తల ద్వారా వెలుగులోకి తీసుకురావడంతో స్పందించిన అధికారులు, రెండు వారాల కిందట పనులు పునఃప్రారంభించారు. కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న రోడ్డుని సిమెంట్‌ రోడ్డుగా అభివృద్ధి చేస్తూ పనులు కొనసాగించి, మధ్యలోనే నిలిపి వేశారు. దీంతో ఓ వైపు సిమెంట్‌ రోడ్డుగా, మరోవైపు బురద రోడ్డుగా మారిన దీనిపై ఆటోలు, ట్రాక్టర్లుతో పాటు ద్విచక్ర వాహనదార్లుకు సైతం రాకపోకలు నరకప్రాయంగా మారాయి. చేపల చెరువుల వద్దకు దాణాతో వెళుతున్న లారీ ఒకటి రెండ్రోజుల కిందట బురదలో దిగిపోయింది. దీనిని బయటకు లాగేందుకు వాహనదార్లు నానా అవస్థలు పడినా ఫలితం లేకుండాపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు