కడతారా వీళ్లు.. కట్టబెడతారా ఇళ్లు!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయిదు పట్టణాల్లో.. 2019 ఆగస్టు తర్వాత.. టిడ్కో గృహ నిర్మాణాలకు సంబంధించి ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. తెదేపా హయాంలో నిర్మాణం ప్రారంభించి... అసంపూర్తిగా నిలిచిన ఈ భవనాల్లో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి.
నాలుగున్నరేళ్లుగా ఇటుక కూడా పెట్టలేదు
అయిదు పట్టణాల్లో టిడ్కో ఇళ్ల తీరు..
లబ్ధిదారులకు బ్యాంకుల నోటీసులు
ఉయ్యూరులో నిలిచిన టిడ్కో ఇళ్లు ఇవే..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయిదు పట్టణాల్లో.. 2019 ఆగస్టు తర్వాత.. టిడ్కో గృహ నిర్మాణాలకు సంబంధించి ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. తెదేపా హయాంలో నిర్మాణం ప్రారంభించి... అసంపూర్తిగా నిలిచిన ఈ భవనాల్లో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. ఈ అయిదు పట్టణాల లబ్ధిదారులు .. అసలు నిర్మాణం పూర్తి చేస్తారా? లేదా? తమకు ఇళ్లు కేటాయిస్తారా లేదా..? అని వాపోతున్నారు.
ఈనాడు, అమరావతి
గుడివాడలో ఆఘమేఘాల మీద పూర్తి చేసిన టిడ్కో గృహాలను సీఎం జగన్ ప్రారంభించారు. మొత్తం 8,912 గృహాల నిర్మాణం చేపట్టారు. దాదాపు నాలుగు నెలలు గడిచినా.. ఇప్పటికి ఆ గృహాల్లో కేవలం పదుల సంఖ్యలోనే ఆవాసం ఉంటున్నారు. మిగిలిన గృహాలన్నింటికీ తాళాలు వేశారు. కారణం మంచినీటి సౌకర్యం లేదనేది లబ్ధిదారుల మాట. ఇక్కడ నీటిని సరఫరా చేసే ఈఎల్‌ఎస్‌ఆర్ వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. మరోవైపు వాయిదా చెల్లించాలని.. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
బిల్లులు చెల్లిస్తేనే..!
ఉమ్మడి జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, నూజివీడు, ఉయ్యూరు పట్టణాలకు మంజూరైన టిడ్కో గృహాలు తెదేపా ప్రభుత్వం మారిన తర్వాత ఒక్క ఇటుక పెట్టలేదు. వీటిని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ చేపట్టింది. ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో కొంతకాలం మౌఖిక ఆదేశాలతో కాలం గడిపింది. తర్వాత నిర్మాణానికి అనుమతి ఇచ్చినా బిల్లులు చెల్లించలేదు. దీంతో ఈ అయిదు స్థానిక సంస్థల పరిధిలోని టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఆగింది. ఈ భవనాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. కొన్ని కిటికీలు దొంగలు తస్కరించారు. ఇనుము దొంగతనానికి గురైంది. ఇటీవల గుత్త సంస్థలకు నోటీసులిచ్చి నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించారు. కొంతమొత్తం బిల్లులు చెల్లించడంతో తిరిగి నిర్మాణం ప్రారంభించాలని ఒత్తిడి చేస్తున్నారు.
- విజయవాడలో మొత్తం ఇళ్లలో 2,490 ఇళ్లను 90 శాతం పూర్తి చేశారు. ఇక్కడ ఎన్‌సీసీ నిర్మాణం చేపట్టింది. ఇటీవల వరకు పనులు ఆపేసింది. తర్వాత అధికారుల సూచనలతో కొంత బిల్లులు చెల్లించాక మళ్లీ పనులు ప్రారంభించారని చెబుతున్నారు. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి.
- ఒక్క గుడివాడ, మచిలీపట్నం పైనే అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఇక్కడ గతంలో మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మచిలీపట్నంలో 2,304 గృహాలకు 1,264 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా వెయ్యి వరకు పూర్తి చేయాల్సి ఉంది. నిర్మాణం ఒక ఎత్తయితే.. వసతుల కల్పన మరో ఎత్తుగా మారిందని అధికారులు చెబుతున్నారు.
రుణం ఇవ్వకున్నా వడ్డీ కట్టాలట...
బ్యాంకర్లు పూర్తి స్థాయిలో రుణం మంజూరు చేయకున్నా.. వడ్డీలు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారు. జిల్లాలో మూడు రకాల గృహాలను 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ప్లాట్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 19,376 పూర్తి చేస్తారు. మొదటి రకం లబ్ధిదారుని వాటా రూ.1. కేంద్రం, రాష్ట్రం రూ.3 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. రెండో రకానికి రూ.25 వేలు, మూడో రకానికి రూ.50 వేలు లబ్ధిదారు వాటా నిర్ణయించారు. బ్యాంకు రుణం రూ.3.15 లక్షలు, రూ.3.65 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి అదనంగా కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందుతుంది. రాష్ట్రం నుంచి అంతే మొత్తం ఇవ్వాలి. విజయవాడలో 6,576, గుడివాడలో 8,912 గృహాలను నిర్మిస్తున్నారు. గుడివాడలో 100 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి.
నోటీసులు వస్తున్నాయండి...
జిల్లాలో బ్యాంకులు మొత్తం రూ.679.70 కోట్లు రుణమిస్తేనే 19,376 ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటికి రూ.348 కోట్లు ఇచ్చాయి. ప్రస్తుతం వీటికి వడ్డీ వసూలు చేయడం చర్చనీయాంశమైంది. పురపాలక సంఘాల ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ పూర్తవగా.. లబ్ధిదారులకు నోటీసులు అందుతున్నాయి. వీరందరినీ ఇప్పుడు కిస్తీలు కట్టాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. తిరువూరులో 384 గృహాలే ఉన్నాయి. లబ్ధిదారుల నుంచి కిస్తీలు కట్టాలని ఒత్తిడి చేసి మరీ వసూలు చేశారు. ముందుగా మెప్మా ఆధ్వర్యంలో త్రైపాక్షిక ఒప్పందం బ్యాంకులు, లబ్ధిదారుడు, యూఎల్‌బీ మధ్య కుదురుతోంది. దీని ప్రకారం రుణం మంజూరు చేస్తున్నారు. తర్వాత ఆ ఇంటిని లబ్ధిదారుల పేరుమీద రిజిస్ట్రేషన్లు చేసి బ్యాంకులు తనఖా పెట్టుకుంటున్నాయి. విజయవాడలో పలువురికి నోటీసులు అందాయి. వీటిపై బ్యాంకుల్లో ఆరా తీస్తే.. పట్టించుకోవద్దని సమాధానం ఇస్తున్నారు. ఒకవైపు నోటీసులు ఇస్తూ.. మరోవైపు పట్టించుకోవద్దంటే ఎలాగని కార్పొరేటర్ ప్రసాద్ ధ్వజమెత్తారు. అసలు నిర్మాణం పూర్తి చేయకండా నోటీసులు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కృష్ణా జిల్లా పరిధిలో రూ.357 కోట్లకు రూ.233 కోట్లు రుణం బ్యాంకులు అందించాయి. వీటిలో రూ.180 కోట్లు వరకు గుడివాడకే ఇచ్చారు. ఇంకా రూ.124 కోట్లు అందాలి. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో రూ.262 కోట్లు మంజూరు రూ.95 కోట్లే విడుదల చేశాయి. ఇంకా రూ.167 కోట్లు అందాల్సి ఉంది. నూజివీడు పట్టణానికి రూ.60.50 కోట్లకు రూ.20 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.40 కోట్లు అందాల్సి ఉందని టిడ్కో ఈఈ చిన్నోడు ‘ఈనాడు’తో చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కష్టం చూడరు.. నష్టం అడగరు
[ 08-12-2023]
ఉమ్మడి జిల్లాలోనే కేవలం ధాన్యం రైతులకు దాదాపు రూ.350 కోట్ల నష్టం వాటిల్లింది. తుపాను ప్రభావం తగ్గి రెండు రోజులు గడిచింది. -
నాడు నయం.. నేడు దయనీయం!
[ 08-12-2023]
‘విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 200కు పైగా అదనపు తరగతి గదులు అవసరం. గత రెండేళ్లుగా విద్యార్థులకు సరిపడా గదులు లేవు. -
ఎప్పటికప్పుడు ఎదురుచూపులే
[ 08-12-2023]
సమగ్రశిక్షలో ఎప్పుడు జీతాలు ఇస్తారో... ఎన్ని నెలలకు ఇస్తారో తెలియక వివిధ విభాగాల్లో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వం: మండలి
[ 08-12-2023]
ఎదురుమొండి దీవుల ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. -
దిశ మారలేదు.. ఘోరాలు ఆగలేదు..
[ 08-12-2023]
‘దిశ యాప్ తోడుంటే.. అన్నయ్య మీ వెంట ఉన్నట్లే..’ అంటూ తరచూ సభల్లో సీఎం జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. -
దళిత సర్పంచిని అవమానిస్తారా?
[ 08-12-2023]
కె.కొత్తపాలెం సర్పంచికి బుధవారం జరిగిన అవమానాన్ని తెదేపా తీవ్రంగా పరిగణించింది. -
కృష్ణా పాలసమితి సేవలు అమూల్యం
[ 08-12-2023]
పశు పోషణ, పాల వృద్ధికి కృషి చేస్తున్న కృష్ణా పాలసమితి(విజయ డెయిరీ), కృష్ణా నదీ పరివాహక ప్రాంతమంతా వ్యాప్తి చెందాలని చినజీయర్ స్వామి ఆకాంక్షించారు. -
అడుగుకో మడుగు.. గజానికో గొయ్యి
[ 08-12-2023]
ఇది కంకిపాడు మండలం బందరు రోడ్డు నుంచి ఈడుపుగల్లు మీదుగా ఉప్పులూరు వెళ్లే రహదారి. -
బల్లలు వేసి.. ఒడ్డుకు చేర్చి..
[ 08-12-2023]
గుడ్లవల్లేరు మండలం వేమవరంలో ఎంఎన్కే రహదారి పక్కన రెండున్నర ఎకరాల్లోని వరి పంట కోసి పనలపై ఉండగా భారీ వర్షంతో ముంపు బారిన పడ్డాయి. -
రైతులకు నష్టపరిహారం అందించాలి
[ 08-12-2023]
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల పరిహారం అందించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు ప్రభుత్వాన్ని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 08-12-2023]
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన గన్నవరం మండలం కేసరపల్లి శివారు హెచ్‌సీఎల్ వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. -
సీఐడీ కానిస్టేబుల్‌కు టోకరా
[ 08-12-2023]
సీఐడీ కానిస్టేబుల్‌కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురుకు చెందిన ఎం.సురేష్ సీఐడీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారు -
బాలిక అపహరణ.. నిందితుడి అరెస్టు
[ 08-12-2023]
ప్రేమ పేరుతో మోసం చేసి పదో తరగతి విద్యార్థినిని ఓ యువకుడు అపహరించిన ఘటనలో నిందితుడ్ని గురువారం అరెస్టు చేసి కోర్టుకు తలించామని గుడివాడ వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్‌కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్‌కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!