logo

సుందర దీవి... కానరాదే ఠీవి?

కేరళ తరహా పచ్చని చెట్లు... గోవాను తలపించే సముద్ర తీరం.. ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణంతో ఎటు చూసినా ప్రకృతి కమనీయ దృశ్యాలతో కట్టిపడేస్తూ మూడు వైపులా ఉప్పుటేరు, ఒకవైపు సముద్రంతో ఉన్న ఈ సుందర దీవి ఎక్కడ అనుకుంటున్నారా..

Published : 27 Sep 2023 04:03 IST

కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరంగా...

కేరళ తరహా పచ్చని చెట్లు... గోవాను తలపించే సముద్ర తీరం.. ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణంతో ఎటు చూసినా ప్రకృతి కమనీయ దృశ్యాలతో కట్టిపడేస్తూ మూడు వైపులా ఉప్పుటేరు, ఒకవైపు సముద్రంతో ఉన్న ఈ సుందర దీవి ఎక్కడ అనుకుంటున్నారా.. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని చినగొల్లపాలెం దీవి. భీమవరానికి సమీపంలో ఉంది. చుట్టూ సముద్రం ఉన్నా ఎక్కడ చూసినా మంచి నీరు ఊరడం ఈ దీవి ప్రత్యేకత. బోటింగ్‌తో పాటు ఇతర వసతులు కల్పించి అందరినీ ఆకర్షించేలా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పాలకులు చెప్పడమే కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంతటి ప్రాధాన్యతగల దీవి క్రమేపీ కోతకు గురవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏ ఏటికాయేడు సముద్రపు కోత కారణంగా కొంతకొంతగా దీవి తరిగిపోతూ వస్తోంది. ఇప్పటికే కొబ్బరి, సరుగుడు తదితర తోటలను సముద్రం తనలో కలిపేసుకుంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతాన్ని, ఈ దీవిని కాపాడుకోవడానికి ఇప్పటికైనా స్పందించకపోతే మున్ముందు కడలి గర్భంలో కలిసిపోయి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ వ్యవసాయ భూములు కూడా కడలిలో కలసిపోతుండడంతో ఈ ఊరి ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. భవిష్యత్తులో ఈ ఊరు ఉంటుందనే నమ్మకం లేక  ఇక్కడ ఉండడానికి ఎవరూ ఇష్ట పడకపోవడంతో త్వరతో ఈ దీవి ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. పాలకులు పట్టించుకుని ఈ దీవి కోతకు గురవ్వకుండా చుట్టూ రక్షణ చర్యలు తీసుకుని, సుందరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది బోటింగ్‌ పాయింట్లు అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

చిన్నగొల్లపాలెంలో హరిత సోయగం

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని