logo

బాబుకు బెయిల్‌పై తెదేపా సంబరాలు

తెదేపా అధినేత చంద్రబాబుపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టినా.. న్యాయస్థానంలో న్యాయం జరిగిందని ఆ పార్టీ శ్రేణులు నినాదాలు చేశాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో తెదేపా శ్రేణులు సోమవారం సంబరాలు చేసుకున్నాయి.

Published : 21 Nov 2023 06:27 IST
ఈనాడు - అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టినా.. న్యాయస్థానంలో న్యాయం జరిగిందని ఆ పార్టీ శ్రేణులు నినాదాలు చేశాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో తెదేపా శ్రేణులు సోమవారం సంబరాలు చేసుకున్నాయి. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశాయి. జగన్‌ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా.. వచ్చే ఎన్నికల్లో తెదేపా విజయాన్ని ఆపలేరని.. తెదేపా, జనసేన శ్రేణులు నినదించాయి.

కృష్ణా జిల్లాలో..

  • మచిలీపట్నంలో తెదేపా కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బాణసంచా కాల్చి పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచారు.
  • పెడన పరిధిలో బంటుమిల్లి మండలంలోని తెదేపా కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి నేతలు సంబరాలు చేసుకున్నారు. న్యాయం గెలిచిందంటూ నినాదాలు చేశారు.
  • ఉయ్యూరులో కౌన్సిలర్‌ సుధారాణి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు.
  • పోరంకి: మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో  తెదేపా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని