Andhra News: పవన్‌ పర్యటనతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: నాదెండ్ల మనోహర్‌

ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. కౌలు రైతుల ఆత్మహత్యలపై

Updated : 12 Apr 2022 06:09 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. కౌలు రైతుల ఆత్మహత్యలపై మూడేళ్ల క్రితం చట్టం చేశారన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వాలని.. కానీ ప్రభుత్వం మాత్రం రూ.లక్ష ఇచ్చి చేతులు దులిపేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా అందడం లేదన్నారు. జనసేన తరఫున రాష్ట్రంలోని వెయ్యి మంది కౌలురౌతు కుటుంబాలను ఆదుకోనున్నట్లు నాదెండ్ల చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి వారిలో ధైర్యం నింపడానికి తలపెట్టిన ‘కౌలు రైతుల భరోసా’ యాత్రను అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్ మంగళవారం ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనతో జగన్‌ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని పేర్కొన్నారు. అనంతపురంలో 28 మంది కౌలురైతు కుటుంబాలకు పవన్‌ ఆర్థిక సాయం అందించనున్నట్లు నాదెండ్ల వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని