logo

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను మోసం చేసిన సహోద్యోగి

ప్రేమ పేరిట నమ్మించి పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడంటూ బాధితురాలు సోమవారం అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు గుంటూరుకు చెందిన యువతి బీటెక్‌

Updated : 13 Jul 2021 09:10 IST

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రేమ పేరిట నమ్మించి పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడంటూ బాధితురాలు సోమవారం అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు గుంటూరుకు చెందిన యువతి బీటెక్‌ చదివింది. రెండు మూత్రపిండాలు పాడవడంతో ఆమె తండ్రి ఒక కిడ్నీ దానం చేసి కుమార్తెను కాపాడుకున్నారు. ఆమె బాగా చదువుకుని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించింది. బెంగళూరులో పని చేస్తున్పప్పుడు చిత్తూరు జిల్లా కంభంవారిపల్లికి చెందిన సహోద్యోగి పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్ల పాటు మాయమాటలు చెప్పి ఆమె వెంట తిరిగి కోరిక తీర్చుకున్నాడు. గత ఏడాది లాక్‌డౌన్‌ విధించడంతో కంపెనీ ఆమెకు వర్క్‌ ఫ్రం హోం అవకాశం ఇచ్చింది. స్వస్థలం నుంచి విధులు నిర్వహిస్తోంది. ఇటీవల అతను మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో పెళ్లి సంబంధం కోసం వివరాలు పెట్టాడు. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో తండ్రితో కలిసి అతని కుటంబ సభ్యులతో మాట్లాడటానికి వెళ్లారు. తక్కువ కులం వారిని పెళ్లి చేసుకోమంటూ తేల్చి చెప్పారు. ప్రేమ, పెళ్లి పేరుతో ప్రలోభపెట్టి కోరిక తీర్చుకుని మోసగించిన అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని