logo

జగన్‌ను కలవాలని తెలంగాణ నుంచి పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డిని కలిసేందుకు తెలంగాణ నుంచి పాదయాత్రగా వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన బుధవారం గుంటూరు జిల్లా

Updated : 15 Jul 2021 07:02 IST

సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఫ్లెక్సీతో కిశోర్‌

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డిని కలిసేందుకు తెలంగాణ నుంచి పాదయాత్రగా వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన కిశోర్‌గౌడ అనే యువకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీతో పాదయాత్ర చేస్తూ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయ సమీపంలోని భారతమాత విగ్రహం వద్దకు వచ్చాడు. ఆయనను కలవాలంటూ చెక్‌పోస్టులోని పోలీసు సిబ్బందిని కోరారు. కొవిడ్‌ నేపథ్యంలో ఎవరినీ అనుమతించడం లేదని పోలీసులు సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలవందే ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించుకొని కూర్చోవడంతో కిశోర్‌ను పోలీసులు అదుపులో తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తనకు జగన్‌పై ఉన్న అభిమానంతో సంగారెడ్డి నుంచి పాదయాత్రగా వచ్చినట్లు యువకుడు పోలీసులకు వివరించారు. తనకు ఎలాంటి సమస్యలు లేవని, ఆయనను కలవడానికే వచ్చానన్నారు. అతని పూర్తి వివరాలు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం స్టేషన్‌లోనే ఉంచి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని